సరిపోదా శనివారం నుంచి ‘గరం.. గరం’ సాంగ్.. రిలీజ్ ఎప్పుడంటే..

by Javid Pasha |
సరిపోదా శనివారం నుంచి ‘గరం.. గరం’ సాంగ్.. రిలీజ్ ఎప్పుడంటే..
X

దిశ, సినిమా : హాయ్ నాన్న మూవీతో లాస్ట్ ఇయర్ బ్లాక్ బస్టర్ కొట్టేసిన నేచురల్ స్టార్ ప్రజెంట్ ‘సరిపోదా శనివారం’లో బిజీగా ఉన్నాడు. వివేక్ ఆత్రేయ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ ఆడియన్స్ ముందుకు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తోంది. నాని, వివేక్ కాంబోలో ఇప్పటికే తెరకెక్కిన‘అంటే సుందరానికి’ చిత్రం కమర్షియల్‍గా బోల్తా కొట్టినప్పటికీ, బెస్ట్ మూవీగా మాత్రం టాక్ సొంతం చేసుకుంది. ఇక సరిపోదా శనివారంతో మరోసారి వీరి కాంబో రిపీట్ అవుతుండగా.. ఆగష్టు 29న ఈ మూవీ రిలీజ్ కానుంది.

కాగా సరిపోదా శనివారం మూవీ నుంచి ‘గరం.. గరం..’ అంటూ ఫస్ట్ సాంగ్ వచ్చేస్తుందని, జూన్ 15వ తేదీన సాయంత్రం ఇది రిలీజ్ కానుందని నేడు (జూన్ 11) అప్డేట్ ఇచ్చింది మూవీ టీమ్. అంతేకాకుండా నాని సీరియస్‌ గా ఇంటెన్స్‌గా చూస్తున్న ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. “ఈ శనివారం కోసం గరం గరం సాంగ్‍ను సూర్య తీసుకొస్తున్నాడు. జూన్ 15న సరిపోదా శనివారం మూవీ ఫస్ట్ సింగిల్ కోసం మీ వూఫర్లను రెడీ చేసుకోండి” అని డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్ ఎక్స్ వేదికగా పేర్కొన్నది.

ఈ మూవీకి మలయాళ సంగీత దర్శకుడు జేక్స్ బెజోయ్ మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగులో ఇప్పటికే ట్యాక్సీ వాలా, చావు కబురు చల్లగా, పక్కా కమర్షియల్, ఒకే ఒక జీవితం సినిమాలకు కూడా మ్యూజిక్ అందించాడు జేక్స్. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్‌లో నాని లుక్ అదుర్స్. ఇక డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఈ మూవీని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. నాని సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‍గా చేస్తుండగా, ఎస్‍జే సూర్య, సాయికుమార్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

Next Story

Most Viewed