ఇంపోస్టర్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న స్టార్ నటి.. అందరినీ మోసం చేస్తుందట..

by sudharani |
ఇంపోస్టర్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న స్టార్ నటి.. అందరినీ మోసం చేస్తుందట..
X

దిశ, సినిమా : హాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ గాల్ గాడోట్ కొంతకాలంగా ఇంపోస్టర్ సిండ్రోమ్‌తో బాధపడుతున్నట్లు తెలిపింది. రీసెంట్‌గా కెరీర్, పర్సనల్ విషయాల గురించి మాట్లాడిన నటి.. ‘ఇది వినడానికి హాస్యాస్పదంగానే ఉంది. నేను నటించిన సినిమాల్లో ప్రతిసారీ నన్ను నేను అనుమానించుకుంటాను. అభద్రతా భావానికి లోనవుతాను. ఎవరూ నన్ను ఇష్టపడరని ఆందోళన చెందుతాను. నా విజయాలను కూడా అంగీకరించుకోవడం కష్టం. అలాగే జనం నన్ను మోసం చేస్తున్నారని ఫీల్ అవుతా. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ల ప్రశంసలకు అర్హురాలిని కాదని భావిస్తా’ అని చెప్పింది. అలాగే డిస్నీ వేదికగా వచ్చిన ఓ సిరీస్‌లో మొదటిసారి ఎవిల్ క్వీన్‌గా నటించడాన్ని నమ్మలేకపోతున్నాని ఆసక్తికరంగా మాట్లాడింది.

Also Read: కొత్త ప్రియుడితో ఎంజాయ్ చేస్తున్న శృతి హాసన్.. ఫొటోస్ వైరల్

Next Story