డైరెక్టర్ హరీష్ శంకర్ ను తిట్టిన హీరో రవితేజ.. పోస్ట్ వైరల్

by Sujitha Rachapalli |
డైరెక్టర్ హరీష్ శంకర్ ను తిట్టిన హీరో రవితేజ.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా : తనకు లైఫ్ ఇచ్చింది హీరో రవితేజ అని చాలా సార్లు చెప్పాడు డైరెక్టర్ హరీష్ శంకర్. నూతన దర్శకుడినైన తనకు 'షాక్' సినిమాతో ఛాన్స్ ఇచ్చి.. బ్రేక్ ఇచ్చాడని చెప్తుంటాడు. అందుకే ఆయనకు ఎప్పుడు రుణపడి ఉంటానని అంటాడు. అందుకే తనతో మాస్ సినిమాలు చేసి.. ఎంతో కొంత కృతజ్ఞతతో ఉంటానని చెప్తాడు. ఈ క్రమంలోనే రవితేజతో Mr Bachan సినిమా తీస్తున్న హరీష్ శంకర్.. ఇందుకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నాడు.

ఇక తాజాగా ఆయన మీద అభిమానంతో ఓ ట్వీట్ చేసిన హరీష్.. ' ప్రపంచంలో అందరికి వయసు వస్తుంది. అన్నయ్యకు తప్ప ' అని పోస్ట్ పెట్టాడు. దీనికి స్పందించిన హీరో రవితేజ... ' ఓవర్ చేయకురోయి నీ దిష్టే తగిలేలా ఉంది ' అని రిప్లయ్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన కన్వర్జేర్షన్ వైరల్ అవుతుండగా.. వీరిద్దరి బాండ్ చూసి మురిసిపోతున్నారు ఫ్యాన్స్.Next Story

Most Viewed