- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘నా ప్రేమ మొదలైంది నీతోనే నాన్న’.. ఆకట్టుకుంటున్న ‘రామం రాఘవం’ గ్లింప్స్

దిశ, సినిమా: జబర్దస్త్ కామెడీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ధనరాజ్ ఒకడు. తన పంచ్‌లతో, కామెడీ టైమింగ్‌తో ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకుని ప్రస్తుతం వెండితెరపై తన అదృష్టన్ని పరీక్షించుకుంటున్నాడు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన ధనరాజ్.. సైడ్ క్యారెక్టర్‌లు, స్పెషల్ రోల్స్ చేస్తూ అలరిస్తున్నాడు. ఇక ఇన్నాళ్ల నటనతో అలరించిన ధనరాజ్.. ఇప్పుడు తన దర్శకత్వంతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అనౌన్స్ చేసిన మూవీ ‘రామం రాఘవం’.
ఈ మూవీలో సముద్రఖనితో పాటు ధనరాజ్ కూడా ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. తండ్రీకొడుకుల మధ్య ప్రేమ కాన్సెఫ్ట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇటీవల ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. వాలెంటైన్స్ డే సందర్భంగా తాజాగా ఈ చిత్రం నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు మేరక్స్. ‘నా ప్రేమ మొదలైంది నీతోనే నాన్న.. హ్యాపీ వాలెంటైన్స్ డే డాడీ’ అంటూ సాగే ఈ క్లిప్ అత్యంత అద్భుతంగా ఆకట్టుకుంటోంది.