‘వార్ 2’పై హైప్ పెంచేస్తున్న ఫైట్ మాస్టర్.. ఎన్టీఆర్, హృతిక్ ఫ్యాన్స్‌లో ఆనందం!

by sudharani |
‘వార్ 2’పై హైప్ పెంచేస్తున్న ఫైట్ మాస్టర్.. ఎన్టీఆర్, హృతిక్ ఫ్యాన్స్‌లో ఆనందం!
X

దిశ, సినిమా: బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్న సినిమా ‘వార్ 2’. స్టార్ హీరోలు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ మూవీ గురించి వచ్చిన ప్రతి అప్‌డేట్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకోగా.. ఇటీవల రిలీజైన గ్లింప్స్‌కు స్పెషల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ‘వార్ 2’పై ఫైట్ మాస్టర్ చేసిన కామెంట్స్ మూవీపై మరింత హైప్‌ను క్రియేట్ చేస్తున్నాయి.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫైట్ మాస్టర్ అనల్ అరసు మాట్లాడుతూ.. ‘‘వార్ 2’ క్లైమాక్స్‌లో తారక్‌, హృతిక్‌ రోషన్‌ మధ్య స్టన్నింగ్ ఫైట్‌ సీక్వెన్స్‌ ఉంటుంది. ఈ సీన్‌ను కొరియోగ్రఫీ చేసింది నేనే’ అంటూ చెప్పుకొచ్చాడు. తారక్, హృతిక్ మధ్య స్టన్నింగ్ ఫైట్ ఉంటుంది అంటూ ఫైట్ మాస్టర్ చేసే కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ కావడంతో.. మీ అప్‌డేట్‌తో మరింత హైప్ పెంచారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఫ్యాన్స్. కాగా.. ఈ మూవీ 2025 ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయ‌నున్నట్టు ప్రకటించారు మేకర్స్‌.Next Story

Most Viewed