నా కూతురి వివాహం సంగతి నాకే తెలియదు.. సోనాక్షి సిన్హా మ్యారేజ్‌పై తండ్రి రియాక్షన్

by sudharani |
నా కూతురి వివాహం సంగతి నాకే తెలియదు.. సోనాక్షి సిన్హా మ్యారేజ్‌పై తండ్రి రియాక్షన్
X

దిశ, సినిమా: బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా పెళ్లి చేసుకోబోతున్నట్లు గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. నటుడు జహీర్ ఇక్బాల్‌తో డేటింగ్ చేస్తున్న ఈ బ్యూటీ.. జూన్ 23న అతడినికి మ్యారేజ్ చేసుకోనుందని నెట్టింట టాక్ నడుస్తుంది. అయితే.. దీనిపై ఇప్పటి వరకు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. కానీ, తాజాగా శత్రుఘ్న సిన్హా తన కూతురు సోనాక్షి సిన్హా మ్యారేజ్‌పై ఓపెన్ అయ్యారు.

ఆయన మాట్లాడుతూ.. ‘నా కూతురు సోనాక్షి పెళ్లి గురించి నేను ఎవరితోనూ మాట్లాడలేదు. ఒకవేళ ఆ జంట (సోనాక్షి, ఇక్బాల్) తమ వివాహం ఎప్పుడు చెప్పిన నేను నా భార్య వారిని ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాము. కానీ వాళ్లు జూన్ 23 న పెళ్లి చేసుకోబోతున్నారనే విషయం మాత్రం మాకు తెలియదు. మీడియా ద్వారా వచ్చిన వార్తలు బట్టే మేము కూడా తెలుసుకున్నాము. ఒకవేళ అదే నిజం అయితే.. ఆమె సంతోషాన్ని కానీ, నిర్ణాయాలకు కానీ మేము అడ్డుపడము. ఎందుకంటే సోనాక్షి తన నిర్ణయాలను తాను సొంతంగా తీసుకునే హక్కు కలిగిఉంది. అలాగే ఆమె నిర్ణయాల పట్ల మాకు నమ్మకం ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed