అజ్ఞాతంలో సమంత.. అసలేమైందని ఆందోళనలో ఫ్యాన్స్!

by Samataha |
అజ్ఞాతంలో సమంత.. అసలేమైందని ఆందోళనలో ఫ్యాన్స్!
X

దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, తన అభిమానులతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది. అంతే కాకుండా ఈ మధ్య తన హాట్ హాట్ ఫొటోషూట్స్‌తో అందరికీ షాకిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ మధ్యకాలంలో సమంత ఎక్కువ మెడికేషన్‌కు సంబంధించిన పోస్టులు పెడుతూ ఉంటుంది. దీంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అసలు సామ్‌కు ఏమైంది? ఎందుకు సినిమాలకు సైన్ చేయకుండా.. టైమ్ తీసుకుంటుంది. రోజూ ఇన్ స్టా స్టోరీస్‌లో మెడికేషన్‌ సంబంధించిన పోస్టులు పెట్టడానికి కారణం ఏంటీ? ఒక వేళ మయోసైటీస్ ఆమెకు మళ్లీ తిరగబడిందా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి సమంత ఏ ప్రాజెక్ట్‌తో అభిమానుల ముందుకు వస్తుందో అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ సామ్ నుంచి అలాంటి సమాచారం ఏం లేదు. పైగా ఎప్పుడూ రెడ్ లైట్ తెరఫీ డేట్, మెడికల్ సెషన్ వివరాలు, అందరూ పాటించాల్సిన హెల్త్ టిప్స్‌ను తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు తప్పితే, ఆమె తన సినిమా అప్డేట్స్ ఏం ఇవ్వడం లేదు. దీంతో తన ఫ్యాన్స్ కాస్త ఆందోళనకు గురి అవుతున్నట్లు సమాచారం. సమంతకు ఇంకా ఆరోగ్యం కుదుట పడలేదు, ఆమె హెల్త్ ప్రాబ్లమ్స్‌తో సతమతం అవుతున్నట్లు ఉన్నారు అని బాధను వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఇంకా అజ్ఞాతంలోనే ఉండిపోతుంది, దాని నుంచి బయటపడలేకపోతుందని వారు ఆందోళన చెందుతున్నారు.

Next Story

Most Viewed