యాంకర్ ప్రదీప్ పెళ్లితో అభిమానులు షాక్.. నెట్టింట శుభాకాంక్షలు తెలుపుతున్న ఫ్యాన్స్

by Disha Web Desk 7 |
యాంకర్ ప్రదీప్ పెళ్లితో అభిమానులు షాక్.. నెట్టింట శుభాకాంక్షలు తెలుపుతున్న ఫ్యాన్స్
X

దిశ, సినిమా: బుల్లితెర స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదిరిపోయే పంచులతో, కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు. ఇప్పటికే పలు షోస్‌తో దూసుకుపోతున్న పద్రీప్.. ఇటీవల ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ అనే సినిమాతో వెండితెర ఎంట్రీ కూడా ఇచ్చాడు. ఇక ప్రోఫిషనల్ లైఫ్ పక్కన పెడితే.. ప్రదీప్ పర్సనల్ మేటర్‌కు సంబంధించిన విషయాలు మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఈ క్రమంలోనే మరోసారి ప్రదీప్ పెళ్లిపై కొత్త రచ్చ స్టార్ట్ అయింది.

ఇటీవల మంచు లక్ష్మీ టీచ్ ఫర్ చేంజ్ అనే ఈవెంట్ కండక్ట్ చేసిన సంగతి తెలిసిందే. దీంట్లో చాలా మంది సెలబ్రిటీలు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే యాంకర్ ప్రదీప్ మాచీ రాజు కూడా ఇందులో పార్టిసిపేట్ చేశాడు. అక్కడ మెరున్ కలర్ ఔట్ ఫిట్‌లో ప్రదీప్ దర్శనమిచ్చాడు. దీనికి సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘రెడీ ఫర్ టీచ్ ఫర్ చేంజ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ కావడంతో.. ‘సరే కానీ పెళ్లి డేట్ ఎప్పుడు’ అని కొందరు ప్రశ్నిస్తుంటే.. మరికొందరు మాత్రం ‘హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అన్నా’ అంటూ ఏకంగా పెళ్లి శుభాకాంక్షలు చెప్పేస్తున్నారు.


Next Story

Most Viewed