ప్రభాస్ మూవీ అనుకుని రాజశేఖర్ కల్కికి టికెట్స్ బుక్ చేసుకుంటున్న ఫ్యాన్స్.. ఏకంగా ఆ షోలన్నీ హౌస్ ఫుల్

by Kavitha |
ప్రభాస్ మూవీ అనుకుని రాజశేఖర్ కల్కికి టికెట్స్ బుక్ చేసుకుంటున్న ఫ్యాన్స్.. ఏకంగా ఆ షోలన్నీ హౌస్ ఫుల్
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కల్కి 2898 ఏడి’ గ్రాండ్‌గా జూన్ 27న థియేటర్లలో రిలీజ్ అవుతోంది. మహాభారతాన్ని, సైన్స్ ఫిక్షన్ ని మిక్స్ చేసి నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఇండియన్ సినిమాను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్తుందని అంతా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కావడంతో ఊహించని సంఘటన చోటు చేసుకుంది.

ప్రభాస్ కల్కి చిత్రంతో అడ్వాంటేజ్ పొందాలని చూసారో ఏమో కానీ రాజశేఖర్ కల్కి చిత్రాన్ని కూడా కొన్ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. దీంతో ప్రభాస్ అభిమానులు చాలా మంది కూకట్ పల్లి భ్రమరాంబ లాంటి థియేటర్ లో ప్రభాస్ కల్కికి బదులుగా రాజశేఖర్ కల్కి చిత్రానికి తప్పుగా టికెట్స్ బుక్ చేసుకున్నారు. ఈ మిస్టేక్ వల్లే దాదాపు రాజశేఖర్ సినిమాకి 6 షోలు హౌస్ ఫుల్ అయిపోయాయి. ఆ తర్వాత ఇది ప్రభాస్ సినిమా కాదని తెలుసుకున్న ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా బుక్ మై షో ని దారుణంగా తిడుతున్నారు. దీంతో బుక్ మై షో సంస్థ స్పందించి.. ప్రేక్షకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అవే టికెట్లతో ప్రభాస్ కల్కి మూవీ చూడొచ్చని క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Next Story

Most Viewed