- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
నాపై తప్పుడు ప్రచారం జరుగుతోంది.. త్రిష వ్యాఖ్యలపై స్పందించిన నటుడు

దిశ, వెబ్‌డెస్క్: ‘లియో’ సినిమాలో విలన్ క్యారెక్టర్‌లో నటించి మెప్పించిన మన్సూర్ అలీ ఖాన్.. తన కో ఆర్టిస్టులపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. దీనిపై లియో డైరెక్టర్ స్పందించగా.. తాజాగా త్రిష కూడా ఓపెన్ అయ్యారు. ‘మన్సూర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. మహిళలను ద్వేషిస్తున్నట్లు ఈ వ్యాఖ్యలు ఉన్నాయి. ఇలాంటి వాళ్లతో కలిసి నాకు సినిమాలో సీన్స్ లేనందుకు సంతోషిస్తున్నాను. నా తర్వాత సినిమాలో కూడా మన్సూర్‌తో నటించకుండా ఉండేలా చూసుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చింది.
అయితే మన్సూర్ వ్యాఖ్యలు నెట్టింట హాట్ హాట్‌గా వైరల్ కావడంతో అతను కూడా దీనిపై స్పందిస్తూ వివరణ ఇచ్చుకున్నారు. ఈ మేరకు ‘ఈ వీడియో వైరల్ అయిందని నా ఫ్యామిలీ ద్వారానే నాకు తెలిసింది. నేను మాట్లాడింది పూర్తిగా చూడకుండా అక్కడ వరకు మాత్రమే కట్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నాకు కూతుర్లు ఉన్నారు. ‘లియో’ సినిమా ఓపెనింగ్‌కి కూడా నా కూతురు వచ్చింది. నా కూతురు త్రిషకి పెద్ద ఫ్యాన్. నాపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. నేను ఇటీవల పాలిటిక్స్‌లో చేరాను. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను. అందుకే నాపై ఇలా నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. నేను ఎంటో, ఎలాంటి వాడినో తమిళ ప్రజలకు తెలుసు. నా గురించి ప్రశ్నించనవసరం లేదు. నాకు ఇది పరువు నష్టం లాంటిది’ అంటూ పోస్ట్ చేశారు. మన్సూర్ పోస్ట్ ప్రస్తుతం వైరల్ కాగా.. అతనికి కొంత మంది సపోర్ట్‌గా నిలుస్తున్నారు.