- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘హనుమాన్’ సీక్వెల్ పై అదిరిపోయే అప్డేట్..!

దిశ, సినిమా: ఎటువంటి అంచనాలు లేకుండా సంక్రాంతికి విడుదలైన ‘హనుమాన్’ సినిమా విశ్వరూపం చూపించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ సృష్టించిన సంచలనం అంత ఇంత కాదు. కేవలం రూ. 40 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా రూ. 330 కోట్ల ఒక పైగా రాబట్టి ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. ఈ క్రమంలో ‘హనుమాన్’ సినిమాకి సీక్వెల్ కూడా ప్రకటించారు దర్శకుడు. ‘జై హనుమాన్’ అనే టైటిల్ తో సీక్వెల్ గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. దీంతో ఈ పార్ట్ 2 ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ ‘జై హనుమాన్’ 2025 సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశం ఉందట.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా ప్రశాంత్ వర్మ ‘ రిలీజ్ టైం కన్నా.. ‘హనుమాన్ 2’ పై ప్రేక్షకుల్లో పెరిగిన అంచనాలను అందుకునేలా తీయడం ముఖ్య. లార్జ్ స్కేల్ మూవీ కావటంతో టైమ్ పడుతుంది. 2025 లో కూడా సాధ్యం కాకపోవచ్చు. 2026 లోనే సినిమా రిలీజ్ ఉండవచ్చు. ఇక ఈ గ్యాప్ లో కమిటైన ‘అధీర’, ‘మహాకాళి’ సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు ఈ సంవత్సరం పూర్తి చేసి ‘జై హనుమాన్’ షూటింగ్ ప్రారంభిస్తా’ అని తెలిపారు. అలాగే హీరో తేజ చేతిలో కూడా చాలా ప్రాజెక్ట్ లు ఉన్నట్లు సమాచారం.