- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఎక్సైజ్ పోలీసుల మెరుపు దాడి.. బుల్లితెర నటులు, సెలబ్రిటీల పార్టీ భగ్నం..!
by Satheesh |
X
దిశ, ఘట్కేసర్: ఘట్కేసర్ మండలం అంకుషాపూర్ గ్రామంలోని ది కాంటినెంటల్ రిసార్ట్స్‌పై ఎక్సైజ్ అధికారులు మెరుపు దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు తెలిసిన వివరాల ప్రకారం.. బుల్లితెర నటులు, సెలబ్రిటీలు సోమవారం అర్ధరాత్రి కాంటినెంటల్ రిసార్ట్స్‌లో అనుమతి లేకుండా పార్టీ చేసుకుంటున్నారనే సమాచారం మేరకు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ బృందం, ఘట్కేసర్ ఎక్సైజ్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడిలో అనుమతి లేకుండా విక్రయిస్తున్న మద్యం బాటిళ్లు సీజ్ చేసి రిసార్ట్స్ మేనేజర్, ఈవెంట్ ఆర్గనైజర్‌పై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. దాడులు జరిపి 24 గంటలు కావస్తున్న ఈ విషయం బయటకు తెలియనివ్వకుండా ఎక్సైజ్ అధికారులు గోప్యంగా ఉంచడం గమనార్హం.
Advertisement
Next Story