- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హార్ట్ టచ్చింగ్ ‘సీతారామం’ సీక్వెల్‌కు సర్వం సిద్ధం..!

దిశ, సినిమా: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో, హీరోయిన్స్‌గా.. హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వనీ దత్ నిర్మించిన సినిమా ‘సీతారామం’. ప్యాన్ ఇండియా స్థాయిలో 2022 ఆగస్టు 5న విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. మ్యూజిక్ పరంగా కథ పరంగా ప్రేక్షకుల మదిలో తిరుగులేని స్థానం సంపాదించుకుంది ఈ మూవీ. ముఖ్యంగా ఇందులో సీత గా మృణాల్ నటన ఎంతగా ఆకట్టుకుందో చెప్పక్కర్లేదు. తన అందంతో జనాలను కట్టిపడేసింది.
ఇక ఇప్పుడు తాజాగా ‘సీతారామం’ సినిమా సీక్వెల్ రాకకు సర్వం సిద్ధమవుతోందని టాక్. అయితే తొలి సినిమాలో సీత, రామ్ పాత్రలకు సంబంధించిన కథ పూర్తయిపోయింది. దీంతో ఆ పాత్రలనే సీక్వెల్ లో వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లి చూపిస్తారు అని అంటున్నారు. అంటే పాత్రలు అవే నేపథ్యం వేరుగా ఉండబోతోంది అని చెప్పవచ్చు. ఇక దుల్కర్, మృణాల్ జంటని మరోసారి చూసి మురిసి పోవడానికి ఆడియన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. కాగా త్వరలోనే ఈ సీక్వెల్ విషయంలో క్లారిటీ రానుంది.