పెళ్లైనా ఆయనతో రిలేషన్‌లో ఉంటా.. ఒకే రూమ్‌లో కలిసి బోల్డ్‌గా ఉన్నామంటూ జీవిత షాకింగ్ కామెంట్స్!

by Hamsa |
పెళ్లైనా ఆయనతో రిలేషన్‌లో ఉంటా.. ఒకే రూమ్‌లో కలిసి బోల్డ్‌గా ఉన్నామంటూ జీవిత షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో రాజశేఖర్, జీవిత ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి శివాని, శివాత్మిక అనే ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు. వీరిద్దరు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి హీరోయిన్స్‌గా కొనసాగుతున్నారు. ఇక జీవిత, రాజశేఖర్ మాత్రం సినిమాలకు దూరమై పలు బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. అయితే నిత్యం వీరిద్దరి ప్రేమకు సంబంధించిన వార్త లెన్నో వచ్చినప్పటికీ జీవిత స్పందించలేదు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన లవ్ స్టోరీ రివీల్ చేస్తూ షాకింగ్ విషయాలు వెల్లడించింది. ‘‘మేమిద్దరం ప్రేమించుకుంటున్నప్పుడే పెళ్లి ప్రస్తావన వచ్చింది. అయితే పెద్ద అంగీకారంతోనే చేసుకోవాలని ముందే నిర్ణయించుకున్నాం. నేను బోల్డ్‌గా చెప్తుగా పెళ్లికి ముందే రాజశేఖర్ గారితో ఓకే రూమ్‌లో గడిపాను.

ఇద్దరం కలిసి జీవించినప్పటికీ.. ఒక వేళ పెళ్లి కాకుంటే నా పరిస్థితి ఏంటి అని భయపడలేదు చనిపోయేవరకు అతనితోనే అని ఫిక్స్ అయ్యాను. అయితే ఇద్దరం రిలేషన్‌లో చాలా క్లోజ్‌గా ఉండేసరికి ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. అయినా మేము పట్టించుకోలేదు. మా ప్రేమ విషయాన్ని మా అమ్మకు కూడా చెప్పాను. ఆయన నన్ను కాకుండా వేరే మహిళను పెళ్లి చేసుకున్నా సరే ఆయనతో రిలేషన్‌లో ఉంటాను. అతను పెళ్లి చేసుకునే అమ్మాయిని ఎలా ఒప్పిస్తారో రాజశేఖర్ గారికి వదిలేశాను. కానీ నేను మాత్రం చనిపోయేవరకు అతనితోనే ఉంటా అని చెప్పా.

దానికి మా అమ్మ షాక్ అయింది కానీ ఏమీ అనలేదు. ఈ క్రమంలోనే రాజశేఖర్ గారికి ఓ మ్యాచ్ ఫిక్స్ అయింది. ఆ అమ్మాయిని నా దగ్గరకు తీసుకుని వచ్చారు. నా గురించి చెప్పాను దీంతో తను వాళ్ళ కుటుంబంతో చర్చించింది. అప్పుడు వారు రాజశేఖరు గారికి కండీషన్ పెట్టారు. నాతో మాట్లాడకుండా ఉంటే పెళ్లికి ఒప్పుకుంటామని. దానికి ఆయన మాట్లాడకుండా ఉండటం కుదరదు అన్నారు. దీంతో పెళ్లి క్యాన్సిల్ అయింది. అంతా బాగానే ఉందనుకునే సమయంలో ఆయనకు యాక్సిడెంట్ అయి హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. నేనే కూడా వెళ్లి సేవలు చేశాను అక్కడే రాజశేఖర్‌తో ఉండి డిశ్చార్జ్ చేస్తే ఇంటికి వెళ్లాం. ఆయన కోలుకునే వరకు ఆయనతో ఉండి కొద్ది రోజులకే పెళ్లి చేసుకున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా సంతోషంగా ఉన్నాము’’ అంటూ చెప్పుకొచ్చింది.

Read More : ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు వారితో శృంగారంలో పాల్గొంటున్నారు.. సంచలన విషయాలు బయటపెట్టిన హీరోయిన్!

Next Story