బాలయ్య ‌హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్.. కారణం ఇదే!

by samatah |
బాలయ్య ‌హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్.. కారణం ఇదే!
X

దిశ, డైనమిక్ బ్యూరో : అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. ఒంగోలు నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక హెలికాప్టర్‌లో శనివారం ఉదయం బాలయ్య బయలుదేరారు. అయితే టేక్ ఆఫ్ అయినా కొద్దిసేపటికి సాంకేతిక లోపం ఏర్పడినట్లు పైలెట్ గుర్తించి వెంటనే ఒంగోలు పోలీస్ గ్రౌండ్‌లో హెలికాప్టర్‌ను అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దీంతో బాలకృష్ణకు పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది. అయితే సిబ్బంది హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నారు. అయితే ఆ హెలికాప్టర్‌లో హీరో బాలకృష్ణతోపాటు హీరోయిన్ శృతిహాసన్, సీనియర్ దర్శకుడు బీ గోపాల్, నిర్మాత నవీన్ ఎర్నేనిలు కూడా ఉన్నారు. అనంతరం బాలయ్య వారందరితో కలిసి రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్‌కు బయలు దేరినట్లు తెలుస్తోంది. ఇకపోతే మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన'వీర సింహారెడ్డి' మూవీ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ ఒంగోలులోని అర్జున్‌ ఇన్‌ఫ్రాలో శుక్రవారం రాత్రి అత్యంత వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.

Also Read..

'Okkadu'మూవీ రీ రిలీజ్..ఎన్ని థియేట‌ర్లలో విడుదలవుతోందంటే

Next Story