ఒరేయ్ నా పేరు చెప్పి మరీ దొంగతనాలు చేయొద్దు.. నాగార్జున ఆసక్తికర కామెంట్స్

by Hamsa |
ఒరేయ్ నా పేరు చెప్పి మరీ దొంగతనాలు చేయొద్దు.. నాగార్జున ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: అక్కినేని హీరో నాగార్జున ఇటీవల నా సామి రంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించాడు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్స్‌లో విడుదలైంది. నెల రోజుల తర్వాత ఇటీవల ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది.

తాజాగా, ఓటీటీలో నా సామి రంగ సినిమా చూడాలని నాగ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలోనే తనకు ఫ్యాన్స్ పంపిన లెటర్స్ చదివి ధన్యవాదాలు తెలిపాడు. అందులో ఓ నెటిజన్ .. ‘ మా నాన్నకు మీరంటే ఇష్టం. నా పదేళ్ల వయసులో ఉన్న ఉన్నప్పుడు నాగార్జున పుట్టినరోజును సెలబ్రేట్ చేయడానికి మా నాన్న జేబులో రూ. 600 దొంగతనం చేశాను’ అంటూ రాసుకొచ్చాడు.

అది చదివిన నాగార్జున ఒరేయ్ వద్దు నా పేరు చెప్పి మరీ దొంగతనం చేయొద్దు అని నవ్వుతూ చెప్పాడు. ఆ తర్వాత ఓ లేడీ ఫ్యాన్ అమల అనే ఆమె లెటర్ చదివాడు. ముందుగా హైదరాబాద్ వచ్చినప్పుడు నాకు అమల- నాగార్జున ఎవరో తెలియదు. ఎవరో చెప్తే మెల్లగా సినిమాలు చూడటం స్టార్ట్ చేశాను. తర్వాత మీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను అంటూ రాసుకొచ్చింది. అయితే ఇవన్నీ చదివిన నాగ్ ఎమోషనల్ అయిపోయారు. ‘‘నన్ను చాలా ప్రేమిస్తున్నారు, అభిమానిస్తున్నారు. నేను చాలా అదృష్టవంతుడిని. ఆరోగ్యంగా, సంతోషంగా ఉండండి థాంక్యూ. డిస్నీ+హాట్ స్టార్‌లో నా సామి రంగ సినిమా చూడండి’’ అంటూ చెప్పుకొచ్చాడు. అంతటితో వీడియో పూర్తి అయిపోయింది.


Next Story

Most Viewed