ముందు గర్భం దాల్చనీయండి.. తర్వాత కదా పెళ్లి : తాప్సీ

by Dishafeatures1 |
ముందు గర్భం దాల్చనీయండి.. తర్వాత కదా పెళ్లి : తాప్సీ
X

దిశ, సినిమా: నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు.. ఏదేమైనా మాట జారకూడదు.. వదిలింది చిన్న మాట అయిన జీవితాలు నాశనం అవుతాయి. ముఖ్యంగా సెలబ్రెటిలు వారి నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా ఒక రాకెట్ లాంటిది అందుకే.. వారి గురించి వారు చెప్పుకోవాలన్నా.. ఇతరుల గురించి మాట్లాడాలన్నా జాగ్రత్తగా మాట్లాడాలి. లేదు అంటే ట్రోల్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. పాపం స్టార్ హీరోయిన్ తాప్సీ పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. పక్కవాళ్ల జీవితాల గురించి వ్యంగ్యంగా మాట్లాడి, లేని ఇక్కట్లను కొని తెచ్చుకుంది.

వివరాల్లోకెళ్తే.. ఆమె బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు మాథిస్‌ బోతో చాలారోజులుగా డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇంతకు ముందు ఓ ప్రైవేటు ఫంక్షన్‌లో తాప్సీని చూసిన అభిమానులు పెళ్లి గురించి ప్రశ్నించగా.. ‘ముందు గర్భం దాల్చనీయండి.. తర్వాత కదా పెళ్లి..’ అంటూ వెటకారంగా స్పందించింది. అయిన కూడా ఈ పెళ్లి రూమర్స్ ఆగడం లేదు.. ఏకంగా ఈ నెల 13న వీరిద్దరు పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు సామాజిక మాధ్యమంలో విపరీతంగా వైరల్‌ అవుతుండటంతో తాప్సీ తిరిగి ఆ వార్తలు ఖండించింది.. ‘నా వ్యక్తిగత జీవితం గురించి ఎవరికీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.. ఇవ్వను కూడా.. ఈ గాలివార్తలు ఇక ఆపండి’ అంటూ తన సోషల్‌మీడియాలో స్పందించింది.. దీంతో తాను గతంలో ఇచ్చిన సమాధానాన్ని గుర్తుచేస్తూ కొంత మంది నెటిజన్లు ‘ఇంకా గర్భం దాల్చలేదా?..’ అని .. ‘ఇంతకీ గర్భం ఎప్పుడు దాలుస్తావ్‌?..’ అని సెటైర్లు మీద సెటైర్లు వేశారు. ఆమె వెటకారంగా ఇచ్చిన సమాదానం ఆమెకే రివర్స్‌ తగలడంతో పాపం తాప్సీ మౌనాన్ని ఆశ్రయించింది.

ఒక విధంగా చెప్పాలంటే తాప్సీ వెటకారం ఇచ్చిన ఈ సమాధానం వెనుక మర్మం లేకపోలేదు. ఎందుకంటే అలియాభట్‌ పెళ్లికి ముందే గర్భం దాల్చింది. ఆ తర్వాత వివాహం చేసుకుంది.. నటి ఇలియానా కూడా సేమ్‌టుసేమ్‌. ఇక వారి వ్యక్తిగత జీవితాలపై పరోక్షంగా సైటైర్‌ వేస్తూ తాప్సీ ఇచ్చిన సమాధానం తిరిగి తన మెడకు చుట్టుకుంది.


Next Story

Most Viewed