జయలలితకు బంగారం అంటే అంత పిచ్చా.. ఎన్ని కిలోలు పోగేసిందొ తెలుసా !

by Kavitha |
జయలలితకు బంగారం అంటే అంత పిచ్చా.. ఎన్ని కిలోలు పోగేసిందొ తెలుసా !
X

దిశ, సినిమా: దివంగత నేత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత.. సినిమాల్లో ఏం సంపాదించిందో తెలియదు కానీ. రాజకీయాల్లోకి వచ్చాక కుప్పలు కుప్పలుగా బంగారు ఆభరణాలు, డబ్బులు, ప్రాపర్టీస్ వంటివి కోట్ల కొద్ది పోగేసింది. అయితే అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన జయలలితకు బెంగళూరు కోర్టు పదేళ్ల క్రితం 100 కోట్ల ఫైన్ , 4 ఏళ్ల జైలు శిక్ష వేశారు కానీ ఆ శిక్ష అనుభవించకుండా జయలలిత చనిపోయింది. ఇక ఈ బంగారం, వెండితో పాటు మిగిలిన వస్తువులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పజెప్పాలని ఫిక్స్ అయ్యింది బెంగుళూరు కోర్టు. దీని కోసం ..6 భారీ ట్రంకు పెట్టెలను తీసుకురావాలని తాజాగా స్టాలిన్ సర్కార్‌కు సూచించింది.

అయితే ఆమె మొత్తం బంగారం లెక్క తేల్చడానికి కోర్టుకు నాలుగు రోజులు టైం పట్టిందట. ఇలా మొత్తంగా లెక్క తేలిన బంగారం విలువ ఏకంగా 27 కిలోలు. దీని బట్టి అర్థం చేసుకోవచ్చు జయలలితకు ఎంత బంగారం పిచ్చి ఉందో. ఇందులో రకరకాల డిజైన్లతో శరీరం నిండా అన్ని అవయవాలకు బంగారు ఆభరణాలు చేయించుకుంది జయలలిత. ఇక ఈ 27 కిలోల బంగారం లో ఒక ఏడు కిలోలు మాత్రం వారసులకు అప్పగించి, మిగతాదంతా కోర్టు వేలం వేయాలని తేల్చేసింది. కానీ జయలలిత పెళ్లి చేసుకోలేదు ఇన్నేళ్ళు ఒంటరిగానే జీవించింది. మరి ఆస్తి ఎవరు అనుభవిస్తారు అనే ప్రశ్నకు చిక్కుముడి కూడా వీడడం లేదు. ఇక మేమంటే మేము అంటూ ఓవైపు జయలలిత సోదరుని కుమార్తె దీప, మరోవైపు దత్తత తీసుకున్న కుమారుడు కోర్టుకెక్కారు. ఇక ఎవరి సైడ్ తీర్పు వస్తుందో చూడాలి.

Next Story

Most Viewed