నాగబాబును చితకబాదిన చిరంజీవి.. కారణమేంటో తెలుసా?

by Disha Web Desk 6 |
నాగబాబును చితకబాదిన చిరంజీవి.. కారణమేంటో తెలుసా?
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు, పవన్ కల్యాణ్ ముగ్గురు పలు సినిమాల్లో నటించి ఎంతగానో ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం నాగబాబు ఇండస్ట్రీకి దూరమై పాలిటిక్స్‌లో రాణిస్తున్నాడు. ఇక చిరంజీవి వరుస చిత్రాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు పోటీ నిస్తున్నాడు. పవన్ కల్యాణ్ మాత్రం పాలిటిక్స్‌లో రాణిస్తూనే గ్యాప్ దొరికినప్పుడల్లా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఈ ముగ్గురిని ఎవరైనా విమర్శిస్తే అస్సలే ఊరుకోరు. ముగ్గురు కలిసిమెలసి ఉంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే చిరంజీవి ఇండస్ట్రీకి రాకముందు ఓ విషయంలో నాగబాబును చితకబాది నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరునే చెప్పడం గమనార్హం.

చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘నేను సినీ ఇండస్ట్రీకి రాకముందు ఇంటర్, నాగబాబు ఏడో తరగతి చదువుతున్నాడు. అప్పుడు ఇంట్లో చిన్న చిన్న పనులను నేను చేసేవాడిని. అయితే ఒకరోజు ఓకే సమయానికి రెండు పనులు చేయాల్సి వచ్చింది. దీంతో నేను బయటకు వెళ్లి ఓ పని చేశా.. బట్టలు లాండ్రీ దగ్గర నుంచి ఇంటికి తీసుకుని రమ్మని నాగబాబుకి చెప్పాను. కానీ నేను తిరిగి ఇంటికి వచ్చి బట్టలు తెచ్చావా? అని అడిగితే.. తీసుకురాలేదు అని అన్నాడు. ఎందుకని అడిగితే నిద్రపోతున్నాను అందుకే పోలేదని అన్నాడు. దాంతో నాకు చాలా కోపం వచ్చి చితకబాదాను. నాగబాబును అలా కొట్టడం చూసి మా అమ్మ వచ్చి నన్నే తిట్టింది. అయినా నేను కొట్టడం ఆపలేదు. మా నాన్న గారు వచ్చాక జరిగిన విషయం చెప్పడంతో నాగబాబును మందలించాడు’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం చిరంజీవి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


Next Story

Most Viewed