వరుణ్ తేజ్‌కు పవన్ కళ్యాణ్ ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా?

by Disha Web Desk 9 |
వరుణ్ తేజ్‌కు పవన్ కళ్యాణ్ ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: వరుణ్-లావణ్య కుటుంబ సమక్షంలో ఏడడుగులు వేశారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా మెగా ప్రిన్స్ పెళ్లి వార్తలే వినిపిస్తున్నాయి. లావణ్య-వరుణ్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. మూడు రోజుల పాటు మెగా ఫ్యామిలీ ఇటలీలో ఎంజాయ్ చేస్తోన్న పిక్స్ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. కానీ అందులో వపన్ కల్యాణ్ కనిపించకపోవడంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు.

ఏపీ రాజకీయ పరిస్థితుల కారణంగా పవన్ కల్యాణ్ ఈ పెళ్లికి వెళ్తాడా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ సతీసమేతంగా ఆయన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించి.. ఇటలీకి వెళ్తున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు. ఎయిర్​ పోర్టులో కనిపించిన పవన్ ఆ తర్వాత వివాహ వేదిక వద్ద ఉన్నట్లు ఒక్క ఫొటో కూడా బయటకు రాలేదు.

దీంతో పవన్ అభిమానుల్లో క్యూరియాసిటీ పెరిగింది. అసలు పవన్ పెళ్లికి వెళ్లాడా? లేదా? ఏమైపోయారు అని తెగ కంగారు పడిపోయారు. తాజాగా పవర్ స్టార్ క్యాజువల్ టీషర్ట్‌లో ఉన్న మూడు ఫొటోలు లీక్ అయ్యాయి. ఇకపోతే పవన్ వరుణ్-లావణ్యకు భారీ గిఫ్ట్ ఇచ్చేందుకు ప్లాన్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీందో ‘‘బాబాయి పెళ్లికి రావడమే వరుణ్ పెద్ద బహుమతిగా భావిస్తారు.’’ ఇక గిఫ్ట్ ఎందుకని మరికొందరు కామెంట్ల మోత మోగిస్తున్నారు.Next Story