తెలుగు స్టార్ హీరోల ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా

by Disha Web Desk 15 |
తెలుగు స్టార్ హీరోల ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా
X

దిశ, వెబ్​డెస్క్​ : సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో కైనా, ఏ నటునికైనా వారి మొదటి రెమ్యూనరేషన్ అనేది చాలా వరకు గుర్తుండిపోతుంది. అయితే ఇండస్ట్రీలోని ఆ స్టార్ హీరోల మొదటి పారితోషికం ఎంతో తెలుసుకోవాలని అభిమానులకు కూడా ఉంటుంది. అదే మన తెలుగు ఇండస్ట్రీలోని అగ్ర హీరోలలో కొందరు ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం..

మెగాస్టార్ చిరంజీవి

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న హీరోలలో స్టార్ హీరోగా పేరుపొందిన మెగాస్టార్ చిరంజీవి తన మొదటి పారితోషికం 1116 రూపాయలు తీసుకున్నారట. ప్రస్తుతం దాదాపు 50 కోట్లకు పైగా అందుకుంటున్నారు.

ప్రభాస్​

ప్రభాస్ 2002లో జయంత్ సి దర్శకత్వంలో వచ్చిన ఈశ్వర్ మూవీ తో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా పెద్ద విజయం సాధించలేదు కానీ పర్వాలేదు అనిపించింది. అయితే ప్రస్తుతం వందల కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ప్రభాస్ తన మొదటి సినిమా ఈశ్వర్ కు 5 లక్షల పారితోషికం తీసుకున్నాడట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలను చెప్పుకొచ్చాడు.

మహేష్ బాబు

మహేష్ బాబు బాలనటుడిగా చాలా సినిమాలు చేసినా రాఘవేంద్రరావు డైరెక్షన్ లో తెరకెక్కిన రాజకుమారుడు మహేష్ కు నటుడిగా తొలి సినిమా అనే సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల మధ్యలో రెమ్యునరేషన్ తీసుకున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు రెమ్యునరేషన్ 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువే ఉంది.

పవన్​కళ్యాన్

1996లో వచ్చిన అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు పవన్ కల్యాణ్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ కు నెలకు 5వేల రూపాయలు చొప్పున పారితోషికంగా ఇచ్చారట నిర్మాత అల్లు అరవింద్. కొన్నేళ్ల కిందట ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా పవన్ కల్యాణ్ చెప్పిన మేటర్ ఇది.

జూనియర్​ ఎన్టీఆర్

నందమూరి నట వారసత్వాన్ని అందిపుచ్చుకొని జూనియర్ ఎన్టీఆర్ మొదటి పారితోషికం 4 లక్షలు. ప్రస్తుతం ఆయన పారితోషికం ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగా తీసుకుంటారని టాక్.

అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ గా పేరుపొందిన అల్లు అర్జున్ ఒక గొప్ప నటుడు. ఆయన మొదటి సినిమాకు రాఘవేంద్రరావు ఇచ్చిన అడ్వాన్స్ ₹100.ఇక పుష్ప 2 కోసం 80 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటున్నారని టాక్.

విజయ్ దేవరకొండ

సినీ కెరీర్ ప్రారంభంలో ఆయన నటించిన నువ్విలా సినిమాకు, శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కి ఆయన ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదట. అందుకే ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికి కాస్త సమయం తీసుకుంటే మంచి ఫలితాలను చూస్తారు అనేది ఇందుకే. కానీ విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలోకి రాకముందు 500 రూపాయలు తీసుకొని ట్యూషన్ చెప్పేవాడు.. అదే నా మొదటి పారితోషికం అని చెప్పాడు. ఇప్పడు ఈయన 45 కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్.

Read more: చిరు పెద్ద కూతురు-ఉదయ్ కిరణ్‌ల గురించి బయటపడ్డ అసలు నిజాలు!


Next Story