అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్ ఈవెంట్‌లో ఏక్తా కపూర్ ధరించిన డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా..?

by Disha Web Desk 7 |
అంతర్జాతీయ ఎమ్మీ అవార్డ్స్ ఈవెంట్‌లో ఏక్తా కపూర్ ధరించిన డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా..?
X

దిశ, సినిమా: ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ఎమ్మీ డైరెక్టరేట్ అవార్డు వేడుక మంగళవారం ఉదయం న్యూయార్క్‌లో ఘనంగా జరిగింది. ఇండియా నుంచి కూడా పలువురు వేదికపై మెరిసి అవార్డులు అందుకున్నారు. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్ ఫర్ కామెడీకి‌గాను నెట్‌ఫ్లిక్స్‌లో వస్తున్న ఇండియన్ కామెడీ షో ‘వీర్ దాస్ ల్యాండింగ్’కు అవార్డు వచ్చింది. అయితే ఈ అవార్డు కోసం మరో షో ‘డైరీ గర్ల్స్’ కూడా టై కాగా.. ‘వీర్ దాస్ ల్యాండింగ్’ అవార్డును పంచుకోవాల్సి వచ్చింది. ఇక వీరితో పాటుగా బాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్‌కు ప్రఖ్యాత ఎమ్మీ డైరెక్టరేట్ అవార్డుని అందించారు.

బాలాజీ టెలీఫిలిమ్స్ సంస్థపై ఎన్నో టీవీ షోలు, సీరియల్స్, ఓటీటీ షోలు, సిరీస్‌లు తెరకెక్కించి సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తున్నందుకు ఆమెకు ఈ అవార్డు వరించింది. దీంతో ఈ ట్రోఫీ అందుకున్న.. తొలి భారతీయ మహిళా ఫిల్మ్ మేకర్‌గా ఎమ్మీస్‌లో ఏక్తా చరిత్ర సృష్టించింది. దీంతో ఆమె ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఫ్యాన్స్ గర్వపడుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా విష్ చేశారు. ఇదిలా ఉంటే ఏక్త ఈ వేడుక కోసం ఆరెంజ్ కలర్ షరారా డ్రెస్‌ ధరించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవగా.. దీని ఖరీదు అక్షరాల రూ 1.49 లక్షలు కావడం విశేషం.

Next Story