- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
శోభన్ బాబు, మురళీమోహన్ బాటలో హీరో శివాజీ.. ముందు చూపు అంటే ఇదే మరి

దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది నటీనటులు సినిమాల్లో నటిస్తే వచ్చిన రెమ్యూనరేషన్‌ను అప్పటికప్పుడు జల్సాలకు ఖర్చు పెడుతూ.. రాయల్ లైఫ్‌ని ఎంజాయ్ చేయాలని చూస్తారు. కానీ కొందరు మాత్రం ముందు చూపుగా ఆలోచించి కొంత కూడపెడ్డకునేందుకు ట్రై చేస్తారు. వారిలో ఒకరు దివాంగత నటుడు, స్టార్ హీరో శోభన్ బాబు ఒకరు. ఆయన సినిమాల్లో వచ్చిన రెమ్యూనరేషన్‌ను వృథాగా ఖర్చు చేయకుండా భూమిని కొనుగోలు చేశారట.
భూమి ఉంటే ఎప్పటికైనా లాభమే కానీ నష్టం ఉండదని భావించే శోభన్ బాబు తోటి నటులకు కూడా ఇదే విషయాన్ని చెప్పేవారట. ఆయన సూచనలు పాటించిన హీరో మురళీ మోహన్ అప్పట్లోనే ఏపీ, తమిళనాడు, బెంగళూరుతోపాటు వివిధ ప్రాంతాల్లో భూములను కొనుగోలు చేశారు. రియల్ ఎస్టేట్ చేసి వందల కోట్లు సంపాధించారు. ఈ కారణంగానే ఆయన సినీ ఇండస్ట్రీలో అత్యధిక సంపన్నుడిగా ఉన్నారు. తాజాగా వారి బాటలోనే నడిచారు హీరో శివాజీ.
నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న శివాజీ.. కొన్నాళ్లు సినిమాల పరంగా మంచి ఫామ్‌లో ఉన్న ఆయన తర్వాత మూవీస్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత రాజకీయాల్లో కూడా సత్తా చాటుకున్నారు శివాజీ.. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 లో రాణిస్తున్నారు. హౌస్‌లో సైలెంట్‌గా కనిపిస్తున్నప్పటికీ తన స్ట్రాటజీస్‌తో అందరిని ఆకట్టుకుంటున్నాడు. ఇదే సమయంలో శివాజీ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
అప్పట్లో తన ఆస్తుల గురించి యాంకర్ అడగ్గా.. ‘‘ఒంగోలు దగ్గర పొదల అనే ప్రాంతంలో 20 ఎకరాల భూమి కొన్నాను. భూమిపై పెట్టిన ఖర్చు నాకు మంచి లాభాలను తెచ్చింది. సినిమాల్లో పెట్టిన డబ్బు వల్ల ఒక్కోసారి మనకు లాభాలు రావొచ్చు లేదా నష్టాలు రావచ్చు. కానీ, భూమిపై పెట్టిన పెట్టుబడి మాత్రం మంచి లాభాలనే ఇస్తుంది. భూదేవి నన్ను ఎప్పుడు మోసం చేయలేదు. నేను నటుడిగానే అందరికి తెలుసు కానీ, నేను వ్యవసాయం కూడా చేస్తాను’’ అంటూ చెప్పుకొచ్చారు.