ఒక్క యాడ్‏కు రణవీర్ సింగ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడో తెలుసా.. !

by Kavitha |
ఒక్క యాడ్‏కు రణవీర్ సింగ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటాడో తెలుసా.. !
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోల్లో రణవీర్ ఒక్కరు. 2010లో ‘బ్యాండ్ బాజా బారాత్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి. ఆ తర్వాత ‘సింగ్ లేడీస్ వర్సెస్ రికీ బహ్ల్’, ‘లూటేరా’, ‘గుండే’ వంటి చిత్రాల్లో నటించాడు. అలాగే పీరియాడికల్ డ్రామా ‘బాజీరావు మస్తానీ’, ‘పద్మావత్’, చిత్రాలతో సూపర్ హిట్ అయ్యాయి రణవీర్. ప్రజంట్ హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వచ్చిన ప్రతి ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం సినిమాల కంటే ఎక్కువ యాడ్‌ల ద్యారా సంపాదిస్తున్నడట రణవీర్. మోడల్ కమ్ యాక్టర్.. రణవీర్ సింగ్ అడిషన్స్ కోసం లగ్జరీ బ్రాండ్ సంస్థలు వెయిట్ చేస్తున్నాయి. దీంతో ప్రజంట్ కమర్షియల్ యాడ్ జనాల్లోకి తీసుకెళ్లాలి అంటే దానికి రణవీర్ సింగ్ కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయాడు. కాగా రీసెంట్‌గా హాలీవుడ్ నటుడు జానీ సిన్స్ తో కలిసి రణవీర్ చేసిన ఓ యాడ్ సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యిందో తెలిసిందే. గూగుల్ ట్రెండింగ్ లో కూడా ఈ యాడ్ కనిపిస్తుంటుంది. ఇక దీంతో ఒక్కో యాడ్ కోసం రణవీర్ ఎంత వసూలు చేస్తాడా? అనే టాపిక్ స్టార్ట్ అయింది. ఈ విషయం తెలుసుకోవడానికి ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

సమాచారం ప్రకారం ప్రస్తుతం ఈ హీరో ఒక్కో యాడ్ కోసం రూ. 3.5 నుంచి రూ. 4 కోట్లు మధ్య వసూలు చేస్తున్నాడట. అంతే కాదు 2022 సంవత్సరంలో, ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (IAA) అతనిని బ్రాండ్ ఎండార్సర్ ఆఫ్ ది ఇయర్‌గా గుర్తించింది. చింగ్స్ నుంచి బింగో వరకు, నివియా నుండి కోల్‌గేట్ వరకు వివిధ బ్రాండ్‌లలో రణవీర్ వర్క్ చేశాడు. అతడు చేసిన యాడ్స్ ఎప్పుడూ ప్రేక్షకులకు ఆసక్తిని కలిగిస్తాయి. మొత్తనికి మూవీస్ కంటే యాడ్ ల ద్యారా రణవీర్ బాగా సంపాదిస్తున్నాడని తెలుస్తోంది.

Next Story

Most Viewed