మెగా ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్.. ఒకే ఫ్రేమ్‌లో నలుగురు స్టార్స్

by Disha Web Desk 6 |
మెగా ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్.. ఒకే ఫ్రేమ్‌లో నలుగురు స్టార్స్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ వ్యాప్తంగా దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చిన్నా పెద్ద అందరూ నూతన వస్త్రాలు ధరించి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా సినీ ప్రముఖులు సైతం దీపావళి జరుపుకుంటూ దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా, రామ్ చరణ్ ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలకు నిన్న రాత్రి దీపావళి పార్టీ ఇచ్చినట్లు సమాచారం. శనివారం హైదరాబాద్‌లోని తమ నివాసంలో ఈ వేడుకలు చేశారు.

అయితే ఈ వేడుకలకు పలువురు సినీ ప్రముఖులు వెళ్లి ఫుల్ ఎంజాయ్ చేశారు. వెంకటేష్, మహేష్ బాబు- నమ్రత, ఎన్టీఆర్- ప్రణతి, టాలీవుడ్ నటీనటులు, దర్శక నిర్మాతలు ఈ పార్టీలో సందడి చేశారు. విందు భోజనం గేమ్స్‌తో అందరూ సరదాగా గడిపారు. అయితే పార్టీకి సంబంధించిన ఫొటోలను మహేష్ బాబు భార్య నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అందులో వెంకటేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు ఒకే ఫ్రేమ్ కనిపించారు. నలుగురు టాలీవుడ్ స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంలో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. క్లీంకార పుట్టిన తర్వాత మొట్టమొదటి దీపావళి కావడంతో చరణ్, ఉపాసన ఈ పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Next Story