- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఎట్టకేలకు విడాకులు తీసుకున్న బుల్లితెర జంట!.. కన్నీరు పెట్టుకుంటున్న వీడియోతో కన్ఫామ్ చేసిన నటుడు పోస్ట్ వైరల్
దిశ, సినిమా: గత కొద్ది కాలంగా సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది విడాకులు తీసుకుని విడిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది చిన్న చిన్న కారణాలు విడివిడిగా ఉంటున్నారు. అయితే సినీ సెలబ్రిటీలే కాకుండా బుల్లితెర జంటలు కూడా విడాకుల బాట పట్టారు. మరో జంట విడాకులు తీసుకున్నట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళితే.. సీరియల్ నటుడు ప్రియతమ్ చరణ్ పలు సిరీయల్స్‌లో నటించి మెప్పించాడు. అలాగే సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించాడు. ఈ క్రమంలోనే సీరియల్ నటి మానసను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ ఇద్దరు కొడుకులు ఉన్నారు.
ఇటీవల ప్రియతమ్, మానస మధ్య ఏవో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారని నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. వాటిపై మానస స్పందించి కొన్ని పరిస్థితుల వల్ల మేమిద్దరం దూరంగా ఉంటున్నామని చెప్పడంతో విడాకులు వార్తలకు బలం చేకూరినట్లు అయింది. కానీ దీనిపై వీరిద్దరు అధికారికంగా ప్రకటించకపోవడంతో విడాకుల పుకార్లకు చెక్ పడింది. ఇదిలా ఉంటే.. తాజాగా, ప్రియతమ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియో షేర్ చేస్తూ ఎమోషనల్ క్యాప్షన్ జత చేశాడు. దీంతో మళ్లీ విడాకులు వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఆ వీడియోలో ఏముందంటే.. ప్రియతమ్ కబోర్డ్‌లో ఫొటో ఆల్బమ్ తీసి తన కొడుకులతో కలిసి ఉన్న ఫొటోలను చూస్తూ కన్నీరు పెట్టుకున్నాడు. వారికి ముద్దులు కూడా పెట్టి ఫొటోలను గట్టిగా హత్తుకున్నాడు. అలాగే ప్రేమ అనేది నాకు, నా కొడుకులకు మధ్య ఒక వంతెన లాగా దూరం చేస్తుంది. వారిని చేరుకునేందుకు కొన్ని వందల ఏళ్లు అయినా నేను ప్రయాణిస్తా. దూరం అనేది బంధాలను విచ్ఛిన్నం చేయదు’’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో ఈ పోస్ట్ చూసిన వారంతా మానస, ప్రియతమ్ విడాకులు తీసుకున్నారని అందుకే ఈ పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చాడని నెట్టింట చర్చించుకుంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ప్రియతమ్-మానస విడాకులు వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.