- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
ఆ విషయంలో నో కాంప్రమైజ్ అంటున్న మెగా డాటర్.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్
దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మించిన మూవీ ‘కమిటీ కుర్రోళ్లు’. ఇందులో కొత్త నటీనటులు నటించగా.. యదు వంశీ దర్శకత్వం వహించాడు. 11 మంది కొత్త కుర్రోళ్లతో తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 9న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంది. అంతే కాకుండా ఈ మూవీ ఏకంగా థియేటర్‌లో 50 రోజులు ఆడడం విశేషం. దీంతో రీసెంట్‌గా 50 రోజుల ఈవెంట్‌ను సెలబ్రేట్ చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ నిహారికపై ప్రశంసలు కురిపించాడు.
‘‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ ప్రమోషన్స్ టైంలో టీమ్ అంతా కలిసి ఊర్లకు టూర్ వేశాము. అప్పుడు నిహారిక హెల్త్ బాలేదు. హెల్త్ బాలేనప్పుడు వీరందరినీ తీసుకెళ్లడం ఎందుకు అని అడిగాను. దానికి నిహారిక ‘ఇప్పుడు కాకపోతే వీళ్లని ఇంకెప్పుడు తీసుకెళ్తారు’ అని చెప్పేవారు. 10 డేస్ ఒక బస్సు వెనక కారులో ట్రావెల్ చేశాము. నిహారిక బ్యాక్ పెయిన్‌తో చాలా బాధపడేది. కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. వారందరిని చాలా ఎంకరేజ్ చేసింది. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా కోసం, ప్రమోషన్స్ కోసం నిహారిక చాలా కష్టపడింది’ అంటూ చెప్పుకొచ్చాడు డైరెక్టర్ యదు వంశీ.