పవన్ కల్యాణ్‌తో కచ్చితంగా సినిమా తీస్తా.. ప్లాప్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

by Disha Web Desk 7 |
పవన్ కల్యాణ్‌తో కచ్చితంగా సినిమా తీస్తా.. ప్లాప్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్‌తో రెండు సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మెహర్ రమేష్. ఈ సినిమాలనే తెలుగులో ‘ఒక్కడు, ఆంధ్రావాలా’గా డబ్ చేశారు. 2008లో జూనియర్ ఎన్టీఆర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈయన.. ఆ మూవీ ద్వారా అనుకున్నంత గుర్తింపు దక్కించుకోలేక పోయాడు. తర్వాత ప్రభాస్‌తో ‘బిల్లా’ సినిమా తీసి యావరేజ్ టాక్ సొంతం చేసుకున్నాడు. దీని అనంతరం ‘శక్తి’, ‘షాడో’ వంటి సినిమాలు తీసి డిజాస్టర్‌గా నిలిచాడు. ఇక అప్పటి నుంచి ప్లాప్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న మోహర్ రమేష్.. ఇటీవల చింరజీవితో ‘భోళాశంకర్’ చిత్రం తెరకెక్కించి మరోసారి ప్లాప్ ముద్ర వేసుకున్నాడు. ‘భోళా శంకర్’ రిలీజైన తర్వాత సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కొన్న ఈ దర్శకుడు.. కొంతకాలం బయట కనిపించలేదు.

అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి అదిరిపోయే కథ రెడీ చేశానని, ఎప్పటికైనా ఆయనతో సినిమా తీస్తానని చెప్పారు. ప్రస్తుతం ప్లాప్ డైరెక్టర్‌గా ఉన్న మోహర్ రమేష్ పవన్‌తో సినిమా తీస్తాను అనే వ్యాఖ్యలు.. పవన్ ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.Next Story