- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా

దిశ, వెబ్‌డెస్క్: రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా పడింది. వచ్చే సోమవారానికి క్రిష్ ముందస్తు బెయిల్ విచారణను హైకోర్టు వాయిదా వేసింది. కాగా, రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో గచ్చిబౌలి పోలీసులు క్రిష్‌ను నిందితుడిగా చేర్చారు. డ్రగ్స్ పార్టీలో ఆయన కూడా పాల్గొన్నారని రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. దీంతో క్రిష్ ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనను ఈ కేసులో తనను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. వివేకానంద స్టేట్మెంట్ ఆధారంగా తనను నిందితుడిగా చేర్చారని.. తాను డ్రగ్స్ తీసుకున్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు.. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించాలని గచ్చిబౌలి పోలీసులను ఆదేశించింది. ఈ పిటిషన్ తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
Read More..
BREAKING: డ్రగ్స్ కేసులో మరో కీలక పరిణామం.. గచ్చిబౌలి పోలీసుల అదుపులో డైరెక్టర్ క్రిష్