ఆ సీన్‌లో రమ్యను చూస్తే కన్నీళ్లు ఆగలేదు: కృష్ణవంశీ

by Disha Web Desk 7 |
ఆ సీన్‌లో రమ్యను చూస్తే కన్నీళ్లు ఆగలేదు: కృష్ణవంశీ
X

దిశ, సినిమా: ప్రముఖ స్టార్ డైరెక్టర్ కృష్ణవంశీ తన భార్య, నటి రమ్యకృష్ణపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయన తెరకెక్కించిన ‘రంగమార్తాండ’ మార్చి 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న దర్శకుడు.. ఈ సినిమా అందరి హృదయాలను టచ్ చేస్తుందన్నాడు. అలాగే ఇందులో రమ్యకృష్ణ పాత్రను చాలా పవర్ ఫుల్‌గా డిజైన్ చేశానన్న ఆయన.. ‘మా ఇంట్లో ఏ నిర్ణయమైనా నా భార్యే తీసుకుంటుంది. ఒకవేళ రమ్య లేనప్పుడు మేము డెసిషన్ తీసుకున్నా దానిలో మార్పులు చేర్పులు చేయమని సూచిస్తుంటుంది. ఇక రమ్యకు శక్తివంతమైన కళ్లు ఉన్నాయి. అరుపులు, కేకలు కాకుండా కళ్లతోనే నటించాలి అని చెప్పగానే ఈ సినిమా ఒప్పుకుంది. తన మేకప్, హెయిర్ స్టైల్ తనే చేసుకుంది. తనెప్పుడూ ఒక విజన్‌తో ముందుకెళ్తుంది’ అన్నాడు. క్లైమాక్స్‏లో ఆమెపై ఒక సీన్‌ను షూట్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డానన్న కృష్ణ వంశీ.. ‘నిజానికి ఆ సీన్ రాస్తున్నప్పుడే చాలా బాధ కలిగింది. షూటింగ్ చేస్తున్న సమయంలో కన్నీళ్లు ఆగలేదు. ఆ రాత్రి నేను నిద్రపోలేదు. గుండె రాయి చేసుకుని షూటింగ్ చేశా’ ఎమోషనల్ అయ్యాడు.

Next Story