- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
డ్రగ్స్ కేసులో పేరు.. అసలు ఏం జరిగిందో క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ క్రిష్

దిశ, వెబ్‌డెస్క్: గచ్చిబౌలి రాడిసన్ బ్లూ హోటల్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పేరు తెరపైకి వచ్చింది. హోటల్‌లో డ్రగ్స్ పార్టీ జరిగిన సమయంలో డైరెక్టర్ క్రిష్ అక్కడే ఉన్నాడని నిర్థారించిన పోలీసులు.. నిందితుల జాబితాలో ఆయన పేరును చేర్చారు. ఎఫ్ఐఆర్‌లో డైరెక్టర్ క్రిష్ పేరును ఏ-8గా పోలీసులు పేర్కొన్నారు. కాగా, డ్రగ్స్ కేసులో తన పేరు రావడంపై క్రిష్ స్పందించాడు. ఆయన ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ.. తాను రాడిసన్ బ్లూ హోటల్‌కు వెళ్లింది నిజమేనని క్లారిటీ ఇచ్చారు. ఫ్రెండ్స్ పిలవడంతో వారిని కలిసేందుకే అక్కడికి వెళ్లానని అన్నారు. హోటల్‌లో ఆదివారం సాయంత్ర అరగంటే ఉన్నానని.. ఆ తర్వాత తన డ్రైవర్ రాగానే వెళ్లిపోయానని స్పష్టం చేశారు.
ఈ విషయంపై పోలీసులు తనను ప్రశ్నించారని.. అక్కడికి ఎందుకు వెళ్లానో.. ఎవరిని కలిశానో పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చినట్లు క్రిష్ పేర్కొన్నారు. కాగా, డ్రగ్స్ కేసులో డైరెక్టర్ క్రిష్ పేరు తెరపైకి రావడం టాలీవుడ్‌లో సంచలనంగా మారింది. ఇక, బీజేపీ యోగానంద్ కొడుకు వివేకానంద రాడిసన్ బ్లూ హోటల్‌లో ఫ్రెండ్స్‌కు డగ్స్ పార్టీ ఇవ్వగా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వివేకానందకు క్రిష్ ఫ్రెండ్ అని.. వీరిద్దరూ తరుచు కలుస్తారని ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలోనే వివేకానంద డ్రగ్స్ కేసులో క్రిష్ పేరు తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది.