- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఆ డైరెక్టర్ నన్ను కొట్టాడు.. హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. స్టార్ హీరో సూర్య కూడా (వీడియో)

దిశ, సినిమా: కొందరు డైరెక్టర్స్ షూటింగ్ సమయంలో యాక్టర్స్ ఏ చిన్న తప్పు చేసినా కానీ ఆగ్రహంతో ఊగిపోతుంటారు. అంతేకాకుండా ఎంతో ముఖ్యమైన సీన్ బాగా చూపించాలని డైరెక్టర్ డిసైడ్ అయ్యాక దాన్ని యాక్టర్స్ చాలా టేక్స్ తీసుకుంటే వారి కోపానికి హద్దులు ఉండవు. ముఖ్యంగా కొంతమంది యాక్టింగ్, మ్యూజిక్, మేకప్, డైలాగ్స్ వంటికి ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటారు. ఈ క్రమంలోనే హీరో, హీరోయిన్లు, లేదా ఆర్టిస్టులు చిన్న మిస్టేక్ చేసినా ఒక్కోసారి కొట్టడానికి కూడా వెనకాడరు. అయితే ఎన్నో హిట్ చిత్రాలు తెరకెక్కించిన డైరెక్టర్ బాలా తనను కొట్టారంటూ హీరోయిన్ మమిత బైజు సంచలన కామెంట్స్ చేసింది.
అసలు విషయంలోకి వెళితే.. హీరోయిన్ మమతా బైజు రీసెంట్‌గా ప్రేమలు చిత్రంతో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటూ గతంలో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకుంటుంది. ఈ క్రమంలోనే ఆమె డైరెక్టర్ బాలా కొట్టినట్లు తెలిపి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ‘‘ వనం గాన్ సినిమా కోసం నన్ను హీరో సూర్యను ఓకే చేశారు. అయితే షూటింగ్ సమయంలో మ్యూజిక్ పరికరాన్ని వాయిస్తూ ఉండాలి. నాకు దాన్ని వాయించడం ఎలాగో తెలియదు. అయితే అప్పుడు డైరెక్టర్‌ను అడిగాను. దాని గురించి తెలిసిన అమ్మాయిలా నటించాలా.. లేక మొదటిసారి వాయిస్తున్నట్లు యాక్ట్ చేయాలా అని. ఆయన దాని వాయించడంలో అనుభవం ఉన్న అమ్మాయిలా నటించమన్నారు. సరే అని ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ క్రమంలో నా వెనుక ఓ అమ్మాయి వాయిస్తుంటే అది చూపించి అలా వాయించాలి అని అన్నారు. సరే అని ట్రై చేస్తుండగానే టేక్ అన్నారు.
అది విని నేను చాలా షాక్ అయ్యాను. ఆ తర్వాత సీన్ చేసేటప్పుడు మూడు టేకులు తీసుకున్నాను. దీంతో డైరెక్టర్ బాలా తిట్టారు. అయితే అంతకుముందుగానే టేకులో ఉన్నప్పుడు తిడతాను అదంతా సీరియస్‌గా తీసుకోకు అని నాకు చెప్పడంతో నేను పెద్దగా పట్టింకోలేదు. ఆ తర్వాత ఒకసారి సెట్‌లో అందరిముందు డైరెక్టర్ బాలా నన్ను కొట్టారు. అయితే బాలా నన్ను కొడుతున్నా సూర్య ఏమీ అనలేదు. ఎందుకంటే సూర్య అంతకు ముందే బాలాతో నటించాడు కాబట్టి వాళ్లకు అది మామూలు విషయం అనిపించింది. కానీ నాకు అలాంటివి కొత్త కావడంతో నేను ఆశ్చర్య పోయాను’’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా వనం గాన్ మూవీ నుంచి సూర్య, మమతా తప్పుకున్నట్లు సమాచారం. ఇందులో రోషిని, అరుణ్ విజయ్‌ను తీసుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఇటీవల విడుదలైంది. తొందరలో వనంగాన్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టాక్.
What 😱
— Christopher Kanagaraj (@Chrissuccess) February 28, 2024
Dir Bala ‘hit’ 👊Mamitha on the sets… Later she moved out from the project though.
[Chellatha Yenya adicha….Porattam Vedikkum!!!] #Vanangaan
pic.twitter.com/vV46aRx48s