మరోసారి బయటపడిన అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు!

by Jakkula Samataha |
మరోసారి బయటపడిన అల్లు, మెగా ఫ్యామిలీ మధ్య విభేదాలు!
X

దిశ, సినిమా :మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరు ఎంతో బాగా కలిసి ఉండేవారు. రెడు కుటుంబాలు కాదు ఇదంతా ఒక్కటే కుటుంబం అనే రేంజ్‌లో వీరి మధ్య అనుబంధం ఉండేది. కానీ ఈ మధ్య వీరు విడిపోయినట్లు అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ కాకుండా, వైసీపీ ఎమ్మెల్యే తరఫున ప్రచారం చేయడంతో ఈ రెండు కుటంబాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. నాగబాబు పరోక్షంగా అతను మనోడే కానీ పరాయి వ్యక్తి అని అల్లు అర్జున్‌ను ఉద్దేశించి పోస్ట్ చేశాడంటూ.. మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య తీవ్ర చర్చ కొనసాగింది. అంతే కాకుండా పవన్ సక్సెస్ సెలబ్రేషన్‌లో అల్లు ఫ్యామిలీ లేకపోవడం, ప్రమాణస్వీకారానికి కూడా వెళ్లకపోవడంతో పుకార్లు నిజమేనని చాలా మందికి అనుమానం వచ్చింది అంతే కాకుండా అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీ గ్రూప్స్ నుంచి లెఫ్ట్ అయ్యాడని, వీరి మధ్య ఇక బంధం తెగిపోయినట్లే అంటూ అనేక వార్తలు వచ్చాయి. కాగా, మరోసారి అల్లు,మెగాఫ్యామిలీకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

పవన్ , అల్లు అర్జున్ మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి అది ఎలా అనుకుంటున్నారా? ఓంకారేశ్వరి అనే పాటను పవన్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్‌నకు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది తెగ వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఓంకారేశ్వరి అనేపాటకు అల్లు అర్జున్ డ్యాన్స్ చేస్తున్న వీడియోను సెట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో ఇద్దరు స్టార్ హీరోల అభిమానుల మధ్య గొడవలు మొదలు అయ్యాయి. దీంతో పవన్ అభిమానులు అల్లు అర్జున్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పవన్ కళ్యాణ్ కోసం ఎడిట్ చేసిన పాటను మీ ఒరిజనల్ పాట అని వాడుకుంటున్నారా.. మీరు మారు కదా ఇంకా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.Next Story

Most Viewed