సౌందర్య- జగపతి బాబు పెళ్లి చేసుకోవాలనుకున్నారా.. అసలు విషయం చెప్పిన స్టార్ హీరోయిన్!

by Hamsa |   ( Updated:2024-03-02 09:10:44.0  )
సౌందర్య- జగపతి బాబు పెళ్లి చేసుకోవాలనుకున్నారా.. అసలు విషయం చెప్పిన స్టార్ హీరోయిన్!
X

దిశ, సినిమా: దివంగత హీరోయిన్ సౌందర్య ఒకప్పుడు ఎన్నో చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులందరినీ మెప్పించింది. అంతేకాకుండా హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోలు వెంకటేష్, జగపతిబాబు, శ్రీకాంత్, నాగార్జున, మోహన్ బాబు, బాలకృష్ణ, హరికృష్ట వంటి వారితో నటించి అందరినీ మైమరిపించింది. ఈ సమయంలోనే సౌందర్య హఠాత్తుగా ఓ ప్రమాదంలో మరణించి దుఖం లోకి నెట్టేసింది.

అయితే సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కొనసాగుతున్న సమయంలో సౌందర్య- జగపతి బాబు వరుస చిత్రాల్లో నటించే సరికి వీరిద్దరి మధ్య ఏదో ఉందని పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నట్లు ఇప్పటికీ వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సౌందర్య ఫ్రెండ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆమని ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చింది. ‘‘ సౌందర్య- జగపతి బాబు మధ్య అలాంటి బంధం ఏమీ లేదు. వాళ్లు ఎక్కువ సినిమాలు చేసేసరికి ఎఫైర్ ఉన్నట్లు రూమర్లు వచ్చాయి. సౌందర్య చాలా మంచిది ఆమె కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. వాళ్ల నాన్నగారు చనిపోయినప్పుడు కూడా నన్ను రమ్మని చెప్పింది. నేను వెళ్లి ఓదార్చాను. అయితే తండ్రి చనిపోయాక వాళ్ళ అన్నయ్యే తనకు అన్నీ తానై చూసుకున్నాడు. ఆయన చెప్పారనే ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కానీ ఆ తర్వాత పిల్లలు పుట్టాక ఆమె చనిపోయింది. ఆ సమయంలో సౌందర్య మరణ వార్త విని నేను చాలా బాధపడ్డాను. దేవుడు ఆమె బదులు నన్ను తీసుకెళ్లినా బాగుండు అనేంతగా నాకు బాధ కలిగింది’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమని కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Read More..

న్యూ ట్రెండ్‌లో మెరిసిన రెజీనా.. టెంప్ట్ చేయడం ఈ థీమ్ ఉద్దేశం కాదంటూ పోస్ట్..

Next Story

Most Viewed