- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
యాంకర్ సుమ లైఫ్‌లో ఇన్ని కష్టాలు ఎదుర్కొందా.. పాపం..!
దిశ, సినిమా: స్టార్ యాంకర్ సుమ గురించి పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్‌లో ఎంత మంది యాంకర్స్ వచ్చినా ఆమెను మాత్రం క్రాస్ చేయలేకపోతున్నారంటే ఆమె ఫాలోయింగ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. తన షోకు వస్తే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే తన మాటలతో అట్రాక్ట్ చేస్తుంది. అలాంటి సుమ.. జీవితంలో ఇన్నో కష్టాలు ఎదుర్కొందట. ఈ విషయాన్ని ఓ కార్యక్రమంలో తన కో యాంకర్ తెలిపింది.
దీపావళి అంటే చాలు బుల్లితెరపై షోలతో సందడి మొదలవుతుంది. ఇందులో భాగంగా ఓ చానల్ దీపావళి ఈవెంట్‌కి ఒకప్పటి నటి, యాంకర్ శిల్పా చక్రవర్తి, సుమ గెస్ట్‌లుగా వచ్చారు. ఈ ఈవెంట్లో శిల్పా చక్రవర్తి, సుమ గురించి మాట్లాడుతూ.. ‘సుమ చూడ్డానికి ఎప్పుడు సంతోషంగా కనిపిస్తుంది. కానీ ఆమె ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో ఇబ్బందులు పడింది. కొన్ని సార్లు అయితే సినిమాకి సంబంధించిన ఈవెంట్స్ లేదా ఇంకా వేరే ఏదైనా షోలు ముగించుకుని ఇంటికి వెళ్లేసరికి అర్ధరాత్రి అయ్యేది. అలావెళ్లి ఇంటి తలుపు కొడితే ఎవరు తీయకపోవడంతో చాలాసార్లు సుమ మెట్ల మీదే పడుకునేది. సుమ అలా పడుకోవడం నేను చాలాసార్లు చూశాను’ అంటూ ఎన్నో విషయాలు బయట పెట్టింది శిల్ప. దీంతో అక్కడే ఉన్న సుమ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది.