ఇళయరాజా దగ్గర సంగీత పాఠాలు నేర్చుకుంటున్న స్టార్ హీరో.. వీడియో వైరల్

by Disha Web Desk 10 |
ఇళయరాజా దగ్గర సంగీత పాఠాలు నేర్చుకుంటున్న స్టార్  హీరో.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి, కమెడియన్ సూరి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా 'విడుదలై'. క్రైమ్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాకు వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ అంచనాలతో వస్తున్న చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు సమాచారం. కాగా మొదటి భాగానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఇళయరాజా సంగీతం సమకూరుస్తుండగా.. తాజాగా మొదటి పాటకు సంబంధించిన అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. ఫిబ్రవరి 8న సాంగ్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా మ్యూజిక్ కంపోజర్ ఇళయరాజా తన అధికారిక ట్విట్టర్ పేజీలో సాంగ్ మేకింగ్ వీడియోను షేర్ చేశారు. కాగా ఈ పాటను స్టార్ హీరో ధనుష్ పాడుతుండగా.. మ్యాస్ట్రో ఆయనకు సంగీత పాఠాలు నేర్పుతుండటం, ఏ పదాన్ని ఎలా పలకాలో సూచిస్తుండటం ఆకట్టుకుంటోంది. ఇక సుగా రాసిన ఈ పాటను ధనుష్‌తో పాటు అనన్య భట్ ఆలపించింది.


Next Story