పుట్టకముందే కల్కిలో యాక్ట్ చేసిన బేబీ..

by Sujitha |
పుట్టకముందే కల్కిలో యాక్ట్ చేసిన బేబీ..
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే 'KALKI 2898 AD' ట్రైలర్ తో బెస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇందులో గర్భవతిగా కనిపించే ఆమె.. సృష్టిని కాపాడబోయే వ్యక్తికి జన్మనివ్వబోతున్నట్లు తెలుస్తుంది. అద్భుతంగా నటించింది కూడా. అయితే ఈ సినిమాలో దీపిక నిజంగానే తన బేబీ బంప్ ప్రదర్శించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం గర్భిణిగా ఉన్న ఆమె.. మరి కొద్ది రోజుల్లో ఓ బిడ్డకు జన్మనివ్వబోతుంది. కానీ మూడు నెలల గర్భంతో ఉన్నప్పుడు ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొన్నదని తెలుస్తుంది. దీంతో పుట్టకముందే దీపిక - రణ్ వేర్ బేబీ ఈ సినిమాలో నటించిందని మురిసిపోతున్నారు ఫ్యాన్స్.

కాగా 'KALKI 2898 AD' మూవీ జూన్ 27న విడుదల కానుండగా.. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. డార్లింగ్ ప్రభాస్ నటించిన ఈ పాన్ వరల్డ్ సినిమాకు నాగ్ అశ్విన్ డైరెక్టర్ కాగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్ర ప్రసాద్, దిశా పఠాని కీలకపాత్రల్లో కనిపించబోతున్నారు. ట్రైలర్ లో ప్రతీ డైలాగ్ ఆదిరిపోగా.. విజువల్ ఎఫెక్ట్స్ కు ఫిదా అయిపోయారు రెబల్ స్టార్ ఫ్యాన్స్.

Next Story

Most Viewed