- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో డాన్స్ అదరగొట్టిన స్టార్ కపుల్స్.. బేబీ బంప్‌తో తగ్గేదెలా

దిశ, సినిమా: మూడు రోజులుగా జరుగుతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ లో బాలీవుడ్ స్టార్స్ అంతా కూడా ఫుల్‌గా సందడి చేస్తున్నారు. షారుఖ్ ఖాన్, సల్మాన్, అమీర్ ఖాన్, జాన్వీ కపూర్, ఖుషి కపూర్, అనన్య పాండే..వంటి స్టార్స్ అంతా కూడా స్టెప్పులేసి మరి వావ్ అనిపించుకున్నారు. ఇక ఇదే వేడుకలో క్యూట్ కపుల్స్ దీపికా పదుకొణె, రణవీర్ మరింత స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
అయితే రీసెంట్‌గా వీరిద్దరు తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్‌లో తమ మొదటి బిడ్డకు స్వాగతం పలకనున్నారు. ఈ విషయాన్ని గత రెండు రోజుల క్రితం దీపికా ఇన్ స్టా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇక ప్రస్తుతం అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ లో ఎంజాయ్ చేస్తున్న దీపికా.. ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసిన తర్వాత మొదటి సారి తన భర్తతో కలిసి డాన్స్ చేసింది. ‘గల్లన్ గూడియాన్’ అనే పాటకు ఈ జంట తమ అద్భుతమైన డ్యాన్స్ తో అతిథులను ఆకట్టుకున్నారు. ప్రెగ్నెంట్‌గా ఉన్న దీపికా మాత్రం నెమ్మదిగా ఎంతో జాగ్రత్తగా డాన్స్ చేసింది. ప్రస్తుతం వీరిద్దరి డాన్స్ వీడియో నెట్టింట వైరలవుతుంది.