‘ఇండియన్-2’ ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్.. అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్

by Hamsa |
‘ఇండియన్-2’ ట్రైలర్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్.. అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
X

దిశ, సినిమా: లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన మోస్ట్ వెయిటెడ్ మూవీ ఇండియన్-2. ఇందులో సిద్దార్థ్, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవాని శంకర్, ఎస్ జె సూర్య, బాబీ, సింహ, సముద్రఖని కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే సినీ ఇండస్ట్రీలో ఇండియన్-2 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్స్ ఎంతలా ఆకట్టుకున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా, ఇండియన్ ట్రైలర్ డేట్‌ను ప్రకటిస్తూ మేకర్స్ ట్విట్టర్ వేదికగా అధికారిక ప్రకటనను విడుదల చేశారు.

అంతేకాకుండా సినిమాకు సంబంధించిన పోస్టర్స్‌ను కూడా షేర్ చేసి హైప్ పెంచారు. ఇండియన్-2 ట్రైలర్ జూన్ 25న రిలీజ్ కాబోతుంది. అయితే పోస్టర్‌లో సేనాపతి అమెరికా నుండి ఇండియాకు తిరిగి వస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ ప్రేక్షకుల్లో ఆతృతను పెంచుతోంది. కాగా, ఈ సినిమా జూలై 12న గ్రాండ్‌గా విడుదల కానుంది. దీంతో ఇప్పటి నుంచే చిత్రబృందం ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. మొత్తానికి ఇండియన్-2 మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి.Next Story

Most Viewed