జోరు పెంచిన ‘ఖుషి’.. మూడో సింగిల్‌కు ముహుర్తం ఫిక్స్

by Disha Web Desk 7 |
జోరు పెంచిన ‘ఖుషి’.. మూడో సింగిల్‌కు ముహుర్తం ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: విజయ్ దేవరకొండ, సమంత జంటగా వస్తున్న సినిమా ‘ఖుషి’. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్-1న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ సూపర్ డూపర్ హిట్‌గా నిలిచాయి. ఇక విడుదల సమయం దగ్గరపడటంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు మేకర్స్.

ఈ క్రమంలోనే మూడో సింగిల్ సాంగ్ రిలీజ్‌కు ముహుర్తం ఫిక్స్ చేశారు చిత్ర బృందం. ‘ఖుషి’ సినిమా టైటిల్‌పై వస్తున్న ఈ సాంగ్‌ను జూలై-28న విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. కాగా.. ఈ సినిమాలో జయరామ్, సచిన్ ఖేడేకర్, అలీ, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

Next Story

Most Viewed