అడ్డంగా దొరికిపోయిన కమెడియన్ అలీ.. చెప్పేవన్నీ నీతులు చేసేవి మాత్రం ఇవేనంటూ నెట్టింట ట్రోల్స్

by Hamsa |
అడ్డంగా దొరికిపోయిన కమెడియన్ అలీ.. చెప్పేవన్నీ నీతులు చేసేవి మాత్రం ఇవేనంటూ నెట్టింట ట్రోల్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ కమెడియన్ అలీ ఎన్ని చిత్రాల్లో నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్నాడు. అలాగే బుల్లితెరపై పలు షోస్‌కు యాంకర్‌గా వ్యవహరించి ప్రేక్షకులను మెప్పించాడు. హీరోగా కూడా నటించి అందరికీ దగ్గరయ్యాడు. ఇక రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటాడు. కానీ ఇటీవల తాను రాజకీయాలకు దూరం అవుతున్నాను అని ప్రకటించాడు. ప్రస్తుతం అలీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. రామ్ పోతినేని డబుల్ ఇస్మార్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ఈ క్రమంలో..తాజాగా, అలీ ఓ బెట్టింగ్ యాప్‌కు ప్రమోట్ చేసి ట్రోల్స్ ఎదుర్కొంటున్నాడు. T20 యాప్ ద్వారా చాలా ఎమౌంట్ సంపాదించవచ్చు. దీనిని నమ్మొచ్చు మరీ మ్యాచ్ అని అన్నాడు. ఇక ఇదే అలీ ఇటీవల అలీలో జాలీగా షోలో శివాజీ వచ్చిన ఎపిసోడ్‌లో బెట్టింగ్ యాప్‌ల గురించి చెప్పి నెట్టింట ప్రశంసలు అందుకున్నాడు. బెట్టింగుల జోలికి పోవద్దు జీవితాలు నాశనం అవుతాయి. డబ్బులు సంపాదించకపోయినా ఫర్వాలేదు కానీ బెట్టింగ్ యాప్స్ జోలికి పోకండి అని చెప్పాడు. ఇప్పుడు అలీ బెట్టింగ్ యాప్‌కు ప్రమోట్ చేసిన వీడియోలు బయటకు రావడంతో.. ఈ రెండిని ఎడిట్ చేసి నెటిజన్లు షేర్ చేస్తున్నారు. వా అన్నా వా నువ్వే నీతులు చెప్పి.. చేసేవన్నీ ఇలాంటి పనులా? అని ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం అలీ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Next Story

Most Viewed