కె-పాప్ గర్ల్ గ్యాంగ్‌తో అల్లు అర్జున్ చిందులు.. మేము ఆగము అంటూ..

by Disha Web Desk 21 |
కె-పాప్ గర్ల్ గ్యాంగ్‌తో అల్లు అర్జున్ చిందులు.. మేము ఆగము అంటూ..
X

దిశ, సినిమా : పాన్ ఇండియా హీరో అల్లు అర్జున్ మరోసారి ట్రెండ్ అవుతున్నాడు. కోక్ స్టూడియో న్యూ సింగిల్‌లో అల్లు అర్జున్ అదరగొట్టేశాడు. అర్మాన్ మాలిక్ పాడిన సాంగ్‌కు ర్యాపర్ స్టైల్‌‌లో రఫ్ఫాడించేసిన బన్నీ.. క్లీన్ డ్యాన్స్ మూవ్స్‌తో షేక్ చేశాడు. ఇక ఈ ఆల్బమ్‌లో కొరియన్ గర్ల్ గ్యాంగ్ TRI.BE గెస్ట్ అప్పియరెన్స్ మరో విశేషం కాగా.. తెలుగు, హిందీ, కొరియన్ లాంగ్వేజ్‌లో వినిపిస్తున్న పాటకు అర్మాన్ మాలిక్ ప్రాణం పోశాడు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన #MemuAagamu కొలాబరేషన్ అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్.. ఆరేళ్ల తర్వత ఇండియాలో కోక్ స్టూడియో కమ్ బ్యాక్ కచ్చితంగా మ్యాజిక్ క్రియేట్ చేస్తుందంటున్నారు.

Read Disha E-paper

Next Story

Most Viewed