ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ అయ్యేది అప్పుడే!

by sudharani |
ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ అయ్యేది అప్పుడే!
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సునీల్, నవీన్‌ చంద్ర, శ్రీకాంత్‌, హ్యారీ జోష్‌, ఎస్‌జే సూర్య, స‌ముద్రఖని, జ‌య‌రాయ్ వంటి స్టార్స్ కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఇక ఇటీవల సినిమా షూటింగ్ కోసం రామ్ చరణ్ వైజాగ్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ వైజాగ్ షెడ్యూల్‌తో ఈ మూవీ షూటింగ్ పూర్తి కానున్నట్లు కూడా నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో రిలీజ్ డేట్‌పై ఫోకస్ పెట్టారు ఫ్యాన్స్. ఈ క్రమంలోనే ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్‌పై హింట్ ఇచ్చాడు డైరెక్టర్.

తాజాగా మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్న డైరెక్టర్ శంకర్.. ‘దీపావళి సీజన్‌కి ఇతర తెలుగు, తమిళ భారీ సినిమాలు విడుదల కానందున ఈ సీజన్‌లో మా ‘గేమ్‌ ఛేంజర్’ను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అంటూ చెప్పుకొచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఈ కామెంట్స్ కాస్త ప్రజెంట్ నెట్టింట వైరల్ కావడంతో.. ఇంకేంటి మరి దీపావళిని గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకునేందుకు సిద్దం కండిరా అబ్బాయిలు అని సందడి చేస్తున్నారు అభిమానులు. అయితే.. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.Next Story

Most Viewed