హీరోయిజంపై చిరు కామెంట్స్ వైరల్.. పరోక్షంగా రజనీకాంత్‌నే అన్నాడంటున్న నెటిజన్లు

by Disha Web Desk 9 |
హీరోయిజంపై చిరు కామెంట్స్ వైరల్.. పరోక్షంగా రజనీకాంత్‌నే అన్నాడంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి రీసెంట్‌గా ఓ బుక్ రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిజంపై చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ మేరకు ఏ రంగంలోనైనా ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని, తనకు కూడా ప్రతి సినిమాకు ఎంతో కష్టపడి ఒళ్లు హూనం చేసుకుంటే తప్పా తృప్తిగా ఉండదని చెప్పాడు. ‘నేను ఎన్ని రోజులు ఇలా కష్టపడి డ్యాన్స్‌లు, ఫైట్‌లు చేయాలని ఆలోచిస్తుంటా. కొంతమంది నడుచుకుంటూ వెళ్లి కూడా సూపర్ హిట్‌లు సొంతం చేసుకుంటున్నారు. హాయిగా సెట్‌కు వెళ్లి మేకప్ వేసుకుని అలా కెమెరాల ముందు నిలబడి కోట్లలో డబ్బులు జేబులో వేసుకుంటున్నారు. కానీ నేను అలా చేయలేను. ఎందుకంటే దర్శకనిర్మాతలు, ప్రేక్షకులతోపాటు నాకు పనిచేసిన ఫీలింగ్ కలగదు’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక చిరు కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతుండగా ఇది పరోక్షంగా రజనీకాంత్‌ను ఉద్దేశించినవేనంటూ కొంతమంది నెటిజన్లు ఆరోపిస్తున్నారు.

Next Story

Most Viewed