షాకింగ్ న్యూస్.. రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న చిరంజీవి?

by Jakkula Samataha |
షాకింగ్ న్యూస్.. రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్న చిరంజీవి?
X

దిశ, సినిమా : చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాడా అంటే అవును అనే సమాధానం వినిపిస్తుంది. చిరు ఎలాంటి సపోర్ట్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. తన నటన, హార్డ్ వర్క్‌తో మెగాస్టార్‌‌గా ఎదిగాడు. అయితే యాక్టర్‌గా తనకంటూ స్పెషల్ గుర్తింపు సొంతం చేసుకున్న తర్వాత ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు,2008లో ప్రజారాజ్యం పార్టీని ప్రకటించారు. ఈ పార్టీ 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో పార్టీ పెట్టి, దానిని నడపడం చాలా కష్టమని భావించిన చిరు, దానిని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. తర్వాత కేంద్ర పర్యాటక మంత్రిగా చేశారు. అయితే తన పార్టీ విలీనం తర్వాత చిరు చాలా విమర్శలు ఎదుర్కొన్నారు.దాంతో ఆయన కొన్ని రోజుల పాటు, సినిమాలకు, రాజకీయాలకు అందరికీ దూరంగా ఉండి, మళ్లీ ఖైదీ నెం150తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి దాని కోసం కష్టపడి చివరికి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు.

అయితే ఇప్పుడు ఆయన మరోసారి రాజకయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారని, ఓ మంచి పదవిని పొంది, ఆయన పొలిటిషన్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు కామెంట్ చేయడంతో, ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.Next Story

Most Viewed