వర్షాన్ని కూడా లెక్కచేయకుండా చిరంజీవి గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్..

by Disha Web Desk 16 |
వర్షాన్ని కూడా లెక్కచేయకుండా చిరంజీవి గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్..
X

దిశ,వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా గాడ్ ఫాదర్. ఈ సినిమాను డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిస్తుండగా రామ్ చరణ్ కొణిదెల ప్రోడక్షన్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను బుధవారం రాయలసీమలోని అనంతపురంలో నిర్వహిస్తున్నారు. అయితే చిరంజీవి మాట్లాడుతున్న సమయంలో భారీ వర్షం కురుస్తున్నా అభిమానులు కదలకుండా అలాగే నిలబడిపోయారు.

''నన్ను ఆదరించిన నా అభిమానులే నాకు గాడ్ ఫాదర్స్'' అంటూ ఉద్వేగంగా ప్రసంగించారు. అంతేకాకుండా సీమకు వచ్చిన ప్రతిసారి వర్షం కురుస్తోంది. వరుణ దేవుడు నన్ను ఆశ్వీరదిస్తున్నాడన్నారు. రామ్ చరణ్ వల్లే ఈ సినిమా చేస్తున్న తెలిపారు. ఎప్పుడో చిన్నప్పుడు వర్షంలో తడిసాను ఇప్పుడు ఇలా తడుస్తున్నందుకు ఆనందంగా ఉంది అన్నారు. గాడ్ ఫాదర్ సినిమాలోని డైలాగ్ చెప్పి ముగించారు. ప్రతి అభిమాని క్షేమంగా ఇంటికి చేరుకోవాలి, అమ్మ నాన్నాలు ఎదురు చూస్తుంటారు జాగ్రత్తగా వెళ్లండి అంటూ అభిమానులు కోరారు చిరంజీవి.


Next Story

Most Viewed