రామ్ చరణ్‌ సినీ ప్రస్థానంపై చిరు ఎమోషనల్ ట్వీట్..

by Disha Web Desk 7 |
రామ్ చరణ్‌ సినీ ప్రస్థానంపై చిరు ఎమోషనల్ ట్వీట్..
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి నేటికి 15 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఎమోష్‌నల్ ట్వీట్ షేర్ చేశారు. ''రామ్ చరణ్ సినిమాల్లోకి వచ్చి 15 ఏళ్లు పూర్తయింది. నటుడుగా మొదలు పెట్టిన అతడి జీవితం.. #చిరుత నుండి, మగధీర నుండి, రంగస్థలం, RRR వరకు.. ఇప్పుడు దర్శకుడు శంకర్‌తో #RC15కి ఎలా ఎదిగాడనేది హృదయపూర్వకంగా ఉంది.'' ''రామ్ చరణ్ తన అంకిత భావంతో తాను చేసే పనిలో రాణించాలనేది అతని సహజమైన కోరిక. నా ప్రియమైన కుమారుడా నీ గురించి నేను గర్విస్తున్నాను.! నీ కోసం ఎన్నో విజయాలు, ఘనతలు ఎదురు చూస్తున్నాయి. వెళ్లి వాటిని చేరుకో. దేవుడు నీకు తోడుగా ఉండుగాక. ఆల్‌వేస్ రామ్ చరణ్'' అంటూ చిరు పోస్ట్ చేశారు.

ఎన్టీఆర్ సరసన కీర్తి సురేష్..?

జపాన్‌లో విడుదల కానున్న 'RRR'.. సరికొత్త రికార్డ్

Next Story