ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు.. ఇది అబద్ధం అయితే బాగుండు.. చార్మీ ఎమోషనల్ పోస్ట్

by sudharani |
ఇలా జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు.. ఇది అబద్ధం అయితే బాగుండు.. చార్మీ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: ‘నీతోడు కావాలి’ అనే చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అమ్మడు ఛార్మీ కౌర్. 14 ఏళ్ల వయస్సులోనే ఇండస్ట్రీకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకుంది. ఇక తమిళం, తెలుగులో కూడా వరుస సినిమాలు చేస్తూ బిజీ లైఫ్ లీడ్ చేసేది. ఇక లాస్ట్‌గా 2013లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘సేవకుడు’ చిత్రంలో మెరిసిన ఛార్మీ.. అప్పటి నుంచి వెండితెరకు దూరమైంది. తర్వాత 2022 లో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లైగర్’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది ఛార్మీ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ కావడంతో హీరోయిన్ ఆశలపై నీళ్లు జల్లినట్లుయింది. ఇదిలా ఉంటే.. వెండితెరపై కనిపించనప్పటికీ అప్పడప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటున్న ఈ అమ్మడు.. తాజాగా ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.

‘మై డియర్ రూహి.. ఇలా నీ గురించి నేను పోస్ట్ వేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నేను ఇంకా షాక్‌లోనే ఉన్నాను.. మాటలు రావడం లేదు. నువ్వు లేవని వస్తున్న వార్తలు అబద్ధం అయితే బాగుండు. మనం చివరగా కూడా ఎంతో సరదాగా, నవ్వుతూ ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం.. మనది 18 ఏళ్ల బంధం. ఇక నిన్ను ఎప్పటికీ మిస్ అవుతాను.. నీ ఆత్మకు శాంతి కలగాలి.. నీ కుటుంబ సభ్యులకు ఆ దేవుడు మరింత శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఛార్మీ ఎమోషనల్ అయింది. కాగా.. ప్రముఖ ఫోటోగ్రాఫర్, రాజమౌళి ఆస్థాన కెమెరామెన్ కేకే సెంథిల్ సతీమణి ఆండ్రూహి అనారోగ్య కారణాలతో గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మృతి పట్ల సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.

Next Story