ఆయన లేకుండా నా కెరీర్‌ను ఊహించుకోలేను.. సిమ్రాన్ ఎమోషనల్ పోస్ట్

by Disha Web Desk 6 |
ఆయన లేకుండా నా కెరీర్‌ను ఊహించుకోలేను.. సిమ్రాన్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ అప్పట్లో బాలయ్య, చిరంజీవి వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది. ప్రస్తుతం సినిమాలకు దూరమై సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటోంది. తాజాగా, సిమ్రాన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆమె మేనేజర్ ఎమ్. కామరాజన్ అనారోగ్యంతో మృతి చెందడంతో సంతాపం తెలిపింది. ‘‘ ఇది అస్సలు నమ్మలేకపోతున్నాను. షాకింగ్‌గా ఉంది. నా ప్రియ మిత్రుడు ఎమ్. కామరాజన్ ఇకలేరు.

ఆయన 25 ఏళ్లుగా నా కుడి భుజంగా ఉన్నారు. ఒక పిల్లర్‌లా నిలబడ్డారు. చాలా చురుకైన వ్యక్తి.. ఎప్పుడూ నవ్వుతూ ఉండేవారు, నమ్మకంగా పనిచేసేవారు. మీరు లేకుండా నా సినీప్రయాణాన్ని ఊహించుకోలేను. ఎంతోమందికి మీరు ఆదర్శంగా నిలిచారు. మిమ్మల్ని ఎంతగానో మిస్ అవుతాం. చాలా త్వరగా వెళ్లిపోయారు. మీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఆమె పోస్ట్ చూసిన వారు ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.Next Story