బ్యాడ్ న్యూస్ చెప్పిన తారక్..!

by sudharani |
బ్యాడ్ న్యూస్ చెప్పిన తారక్..!
X

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల వేడుక కోసం ప్రపంచమంతా చాలామంది వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లో మరీ ఆసక్తి నెలకొంది. మన తెలుగు సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’ ఆస్కార్ బరిలో నిలవడమే ఇందుకు కారణం. అయితే ఈ 12వ తేదీన లాస్ ఏంజిల్స్‌లో జరిగే ఈ ఆస్కార్ అవార్డు ఈవెంట్‌లో మన తెలుగు హీరోలిద్దరూ ‘నాటు నాటు’ సాంగ్ పర్ఫామెన్స్ ఇస్తున్నట్లుగా వార్తలు వినిపించాయి.

కాగా.. ఇప్పటికే అమెరికా చేరుకున్న మన హీరోలు అక్కడ రకరకాలుగా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నారు. ఇందులో భాగంగా ఓ ఇంటర్వ్యూలో వేదికపై ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులు వేయడం గురించి ఎదురైన ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. “ఆ ఆస్కార్‌ వేదికపై ‘నాటు నాటు’ పాటను లైవ్‌లో చేయాలని ఆసక్తిగా ఉన్నా. కానీ అలా వేస్తామని కచ్చితంగా చెప్పలేను. నాకు, రామ్‌ చరణ్‌కు రిహార్సల్స్‌ చేసేందుకు అసలు టైమే లేదు. అందుకని ఆస్కార్‌ వేదికపై మేము డ్యాన్స్‌ చేయలేకపోతున్నాం’’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు తారక్.

Also Read..

ఆ ఇద్దరు అమ్మాయిలతో రామ్ చరణ్.. ఫొటోలు వైరల్

Next Story

Most Viewed